జ్యోతికని మరిపించేంత సత్తా చందమామకి ఉందా?

Update: 2022-10-13 01:30 GMT
సౌత్‌ సినీ ప్రేక్షకులతో పాటు నార్త్‌ ప్రేక్షకులకు చంద్రముఖి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది జ్యోతిక. ఆమె చంద్రముఖి గా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన తన నటనతో చంద్రముఖి సినిమా స్థాయిని పెంచింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా జ్యోతిక కెరీర్‌ లో కూడా ఆ సినిమా నిలిచి పోయే సినిమా.

జ్యోతిక ను చంద్రముఖి గా పి వాసు చూపించాడు. చంద్రముఖి సినిమాలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించాడు. కీలక పాత్రలో ప్రభు ఇంకా నయనతార నటించారు. ఇప్పుడు చంద్రముఖి పార్ట్‌ 2 సినిమా పట్టాలెక్కింది. తాజాగా రామోజీ ఫిల్మ్‌ సిటీ లో చంద్రముకి 2 ని ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 ను పట్టాలెక్కించారు. పి వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో లారెన్స్ నటిస్తున్న నేపథ్యంలో ఇంతకు చంద్రముఖి గా ఎవరు నటిస్తున్నారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో ఆలోచన లేకుండా జ్యోతికను తీసుకు వస్తే ఎలాంటి సమస్య ఉండదు అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.

చంద్రముఖి పాత్రకు గాను దర్శకుడు వాసు మరియు లారెన్స్ లు ఎంతో మంది హీరోయిన్స్ ను సంప్రదించారు. చివరకు హిందీ ముద్దుగుమ్మలతో కూడా చర్చలు జరిపారు. చివరకు రెండవ చంద్రముఖి గా చందమామ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ ను ఎంపిక చేసినట్లుగా తమళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పెళ్లి చేసుకుని తల్లి అయిన కాజల్‌ అగర్వాల్‌ కాస్త సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ కచ్చితంగా చంద్రముఖి పాత్రకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో లారెన్స్ మరియు దర్శకుడు వాసు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

షూటింగ్‌ తాజాగా ప్రారంభం అయ్యింది. త్వరలోనే సినిమా యొక్క పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాజల్‌ అగర్వాల్‌ యొక్క విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News