ఆ బంధం గురించి కత్రినాకే తెలుసు!!

Update: 2018-06-26 05:57 GMT
ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రేమ జంటలు చాలానే ఉన్నాయి. రోజు అక్కడి మీడియాలో బాలీవుడ్ లవర్స్ అంటూ ఎదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇకపోతే గత కొంత కాలంగా రన్ బీర్ - అలియా భట్ మధ్య కూడా ప్రేమాయణం చాలా జోరుగా నడుస్తోందని  టాక్ వస్తోంది. అంతే కాకుండా ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. రన్ బీర్ కుటుంబ సభ్యులు కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇకపోతే ఈ రిలేషన్ వల్ల అలియాకు కత్రినాకు మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నట్లు మరో టాక్ వైరల్ అయ్యింది. గతంలో కత్రినాకు రన్ బీర్ మధ్య బంధం చాలా క్లోజ్ గా కొనసాగింది. ఏడేళ్ల వరకు నడిచిన వారి రిలేషన్ రన్ బీర్ కుటుంబ సభ్యుల కారణంగా బ్రేకప్ అయిపోయిందని అప్పట్లో వారి సన్నిహితులు తెలిపారు. ఇకపోతే ఇటీవల అలియాను రన్ బీర్ కుటుంబ సభ్యులు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కత్రినాకు ఎందుకో నచ్చడం లేదట. ఆమెకు కొంత బాధగా ఉందని ఆమె స్నేహితుల ద్వారా తెలిసింది.

కత్రినాకు ఒకరి విషయాల్లో ఎక్కువగా తలదూర్చే స్వభావం కాదు. ఎవరైనా సరే సొంత అనుభవాలే గుణపాఠాలుగా నేర్చుకుంటారు అది తనకు తెలుసు. ఎంతవరకు ఉండాలో అంత వరకే తన పరిధిలో కత్రినా ఉంటుందని ఆమె సలహాలు ఇస్తే ఇక సెటైర్లు మొదలు పెడతారని కత్రినా స్నేహితురాలు తెలిపింది. ఇక ఫైనల్ గా ఈ రిలేషన్ ఎలా ఎండ్ అవుతుందో కత్రినాకు మాత్రమే తెలుసనీ కూడా ఆమె వివరించారు.
Tags:    

Similar News