ఇంతకీ ఈ బయోపిక్కులు తీస్తారా సార్

Update: 2019-04-08 08:08 GMT
రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటించినప్పుడు దానికి పోటీగా లక్ష్మీస్ వీరగ్రంధం ప్రకటించి కొన్ని రోజులు వార్తల్లో నిలిచిన దర్శక నిర్మాత కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆ తర్వాత కనిపిస్తే ఒట్టు. లక్ష్మి పార్వతి పాత్రలో శ్రీరెడ్డితో ఇది తీయబోతున్నట్టు కొంత హంగామా చేశారు కానీ అసలు షూటింగ్ ప్రారంభమైన సూచనలు కూడా లేవు. టీజర్ అంటూ పోస్టర్ అంటూ హడావిడి జరిగింది. అదంతా అతుకుల బొంతలా చేసిన వ్యవహారంలా అనిపించింది.

ఇదిలా ఉండగా ఇప్పుడీయన మరో సినిమా అనౌన్స్ చేశారు. అదే శశిలలిత. వర్మ శశికళ చేస్తానని చెప్పిన కొద్దిరోజులకే ఈయన ఇప్పుడు శశిలలిత అంటూ మళ్ళి టాక్ లో వచ్చే ప్రయత్నం చేయడం చూస్తే ఇంతకీ ఇదంతా సినిమాలు తీసేందుకేనా లేక ఫ్రీ పబ్లిసిటీ కోసమా అనే అనుమానం రాకమానదు. ఇప్పుడీ శశిలలిత అనే పేరులోనే భలే కామెడీ ఉంది

అసలు మన హీరోల బయోపిక్కులే జనం చూడటం లేదు. ఎన్టీఆర్ ఫలితం చూసాక అలాంటివి తీద్దామని ఆలోచనలో ఉన్న దర్శక నిర్మాతలు పునరాలోచనలో పడి కొందరు ఇప్పటికే డ్రాప్ అయ్యారు. అలాంటిది మనకు మాజీ నటిగా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా అంతగా కనెక్టివిటీ లేని జయలలిత ఆవిడ స్నేహితురాలు శశికళ కథను చెబితే చూస్తారా. వర్మ ఏదో వివాదం రేపి పబ్లిసిటీ చేసుకుంటాడు కానీ అది అందరివల్ల జరిగే పని కాదు. అందుకే  కేతి రెడ్డి ప్రకటనలు చూస్తుంటే కామెడీగా ఉందని ఫిలిం నగర్ లోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
   

Tags:    

Similar News