యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ మూవీ తెలుగులో నిర్మాత సాయి కొర్రపాటి డబ్బింగ్ రైట్స్ ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసి దాదాపుగా రూ.15 కోట్ల లాభాలను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ 2 అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సౌత్ ఇండియాలోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందని ఇటీవల విడుదల అయిన టీజర్ ను చూస్తుంటే అనిపిస్తుంది. మొన్నటి వరకు కేజీఎఫ 2 సినిమా తెలుగు రైట్స్ 40 నుండి 50 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది. టీజర్ వచ్చిన తర్వాత ఆ మొత్తం మరింతగా పెరిగింది.
కేజీఎఫ్ 2 తెలుగు డబ్బింగ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. కనుక నిర్మాతలు ఇప్పుడు ఏకంగా రూ.60 కోట్లకు పైగా ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమా ఏకంగా 60 కోట్ల బిజినెస్ చేస్తే అంత రిటర్న్ సాధ్యమా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేజీఎఫ్ 2 పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కాని ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం అనుమానమే అంటున్నారు. అయితే రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు అది సాధ్యం అయ్యింది. కాని ఈ సినిమా పరిస్థితి ఏంటీ అనేది మాత్రం విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.