కొంత మంది తమ అతి జాగ్రత్త కారణంగా గోల్డెన్ ఛాన్స్ లు మిస్ చేసుకుంటుంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని తన అతి జాగ్రత్త వల్ల క్రేజీ హీరోయిన్ నిత్యామీనన్ కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. వివరాల్లోకి వెళితే.. మహేనటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ 'మహానటి'. ఇందులో కీర్తి సురేష్ టైటిల్ లోల్ లో నటించి మేకర్స్ తో పాటు ప్రేక్షకుల్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. తనదైన నటనతో సావిత్రి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మెస్మరైజ్ చేసింది.
ముందు ఈ పాత్రకు తనని ఎంపిక చేసుకోవడం ఏంటీ? అని విమర్శించిన వాళ్లే వెండితెరపై సావిత్రిగా కీర్తి సురేష్ నటనకు ఆశ్చర్యపోయారు. తను తప్ప ఈ స్థాయిలో సావిత్ర పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేయలేరని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో కీర్తిసురేష్ కనబరిచిన అద్బుత అభినయానికి గానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కారం అభించిన విషయం తెలిసిందే. అవార్డులు, రివార్డులు దక్కించుకుని దేశ వ్యాప్తంగా కీర్తి సురేష్ పాపులర్ అయింది.
అయితే ఈ పాత్ర కోసం ముందు దర్శకుడు నాగ్ అశ్విన్ మలయాళ క్రేజీ హీరోయిన్ నిత్యామీనన్ ని అనుకున్నారట. అయితే చివరి నిమిషంలో నిర్మాత అశ్వనీదత్ అభ్యంతరం చెప్పడంతో ఆమెని తప్పించి ఆ స్థానంలో కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారట. ఇటీవల ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన అశ్వనీదత్ ఈ విషయాన్ని వెల్లడించారు. సావిత్రి పాత్ర కోసం ముందు నాగ్ అశ్విన్ .. మలయాళ నటి నిత్యామీనన్ ని అనుకున్నాడు.
అయితే ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న నిత్యామీనన్ ఇందులో మద్యం సేవించే సన్నివేశాలు ఏమైనా వున్నాయా? అని చిత్ర బృందాన్ని ఆరాతీసిందట.
అలాంటి దృశ్యాలు వుంటే తాను ఈ సినిమా చేయనని కొంత మంది ఫిల్మ్ మేకర్స్ తో వివరించిందట. ఆ విషయం నిర్మాత సి. అశ్వనీదద్ చెవిన పడటంతో తను ఈ ప్రాజెక్ట్ కి వద్దంటే వద్దని, ఇప్పడే స్క్రిప్ట్ లో మార్పులకు డిమాండ్ చేస్తోందని, అలాంటి నటి సావిత్ర పాత్రకు అసలే వద్దని చెప్నారట.
దీంతో నాగ్ అశ్విన్ తనని తప్పించి ఆ స్థానంలో కీర్తి సురేష్ ని ఫైనల్ చేసుకున్నారట. అలా సువర్ణావకాశాన్ని నిత్యామీనన్ కోల్పోయిందట. సావిత్రి పాత్రకు నిత్యామీనన్ కూడా న్యాయం చేసేదే కానీ కీర్తి సురేష్ మాత్రం ఊహించని స్థాయిలో ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసి అందరిని ఆశ్చర్యపరచడం, ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు సినిమాకు మరింత ప్లస్ గా మారి ప్రతీ ఒక్కరికీ చేరువయ్యేలా చేసింది.