పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. '#PSPK28' అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడే మళ్ళీ 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడే మొదలైంది.. ఈసారి వినోదం మాత్రమే కాదని పేర్కొన్న హరీష్, ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసాడు. గతేడాది నుంచి ఈ కథ పై వర్క్ చేస్తున్న హరీశ్.. ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. ఈ సోషల్ డ్రామా లో ఒక పాత్రలో కాలేజీ లెక్చరర్ గా.. మరో పాత్రలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా కనిపిస్తారట. పవన్ గతంలో 'తీన్ మార్' చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించారు కానీ కాంబినేషన్ సీన్స్ ఉండవు. ఇప్పుడు హరీష్ సినిమా కోసం డ్యూయల్ రోల్ చేసే సాహసం చేస్తున్నారని అంటున్నారు. దీని కోసం ఇప్పటికే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్రత్యేకంగా కాలేజీ సెట్ ను కూడా నిర్మిస్తున్నారట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
'పవన్ - హరీష్' ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ కలిసి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కోవిడ్ పరిస్థితులు చక్కబడితే ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.