పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో గత కొన్ని నెలలుగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. అవునంటే కాదని.. కాదంటే అవునని అన్నట్టుగా పవన్ కల్యాణ్ సినిమాల పరిస్థితి కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం తొలి పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు'లో నటిస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో భారీ సినిమాల ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం మరో నిర్మాత ఏ. దాయాకర్ రావుతో కలిసి ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు.
కరోనా ముందు నుంచి ఈ మూవీ షూటింగ్ ఆగుతూ సాగుతూ వస్తోంది. పవన్ బిజీ షెడ్యూల్ కాకరణంగా ఈ మూవీ ఇప్పట్లో పూర్తవుతుందా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ ఎట్టకలకు ఈ మూవీ షూటింగ్ తాజా షెడ్యూల్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టారు. అక్కడ పవన్ తో పాటు 900 వందల మంది పాల్గొనగా పలు కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు పవన్ కల్యాణ్ మరో మూడు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ, 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో 'తేరి' రీమేక్ తో పాటు నటుడు సముద్రఖని దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ 'వినోదాయ సితం' రీమేక్.
ఇందులో హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో 'తేరి' రీమేక్ ని సెట్స్ పైకి ఎప్పుడు తీసుకెళుతున్నారన్నది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ రెండు సినిమాలు ఇప్పట్లో సెట్స్ పైకి వెళతాయా? అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఇదిలా వుంటే రెండు ప్రాజెక్ట్ ల విషయంలో పవన్ కల్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న 'హరి హర వీరమల్లు' మూవీని జెట్ స్పీడుతో పూర్తి చేసి హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్' మూవీని, 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో 'తేరి' రీమేక్ ని డిసెంబర్ లో లాంఛనంగా ప్రారంభించాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అదే నెలలో రెండు సినిమాల రెగ్యులర్ షూటింగ్ లు కూడా వెంట వెంటనే మొదలు పెట్టాలనుకుంటున్నారట.
ఈ రెండు సినిమాల్లో ఒక మూవీని 2023 ఇయర్ ఎండింగ్ లో.. మరో మూవీని 2024 ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పవన్ తీసుకున్న తాజా నిర్ణయం నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.