'ఆర్ ఆర్ ఆర్'లో రాంచరణ్ లుక్ ఇదేనా..!

Update: 2020-03-26 13:03 GMT
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ హవా నడుస్తుంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రాంచరణ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక యూట్యూబ్ లో సంచలనం రేపుతున్న ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ లో ఎన్టీఆర్, రాంచరణ్ లుక్కులను చూపించారు చిత్రయూనిట్. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారని ఇదివరకే రాజమౌళి చెప్పేసారు.

ఇక తాజాగా 'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ లోని వేషధారణ లపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా చూపించిన రాజమౌళి, రాంచరణ్ ని మాత్రం ప్యాంటు షర్ట్ వేసి చూపించాడని అంటున్నారు. అల్లూరి సీతారామరాజు అంటే తెలుగుదనం ఉట్టిపడే వేషధారణలో ఉంటాడని అందరూ చరిత్రలో చదివారు. అదీగాక ఇదివరకే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అల్లూరి జీవితాన్ని తెరకెక్కించారు. అందులో అప్పటి కాలంనాటి వేషధారణ చూపించారు కానీ ప్యాంటు షర్ట్స్ వేయలేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ లుక్ కేవలం మోషన్ పోస్టర్ వరకే అంటున్నారు మరికొందరు. చూడాలి మరి చిత్రయూనిట్ నుండి ఎలాంటి స్పందన రానుందో..
Tags:    

Similar News