మాస్ మహారాజా రవితేజ కమర్శియల్ చిత్రాలకు పెట్టింది పేరుగా దూసుకుపోతాడు? అని చెప్పాల్సిన పనిలేదు. ఇతను దర్శకుల్నిమించిన హీరో. దర్శకుడు చెప్పిన దానికంటే ఓ పావు వంతు ఎక్కువే చేస్తాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో ఏ మాత్రం తగ్గడు. హీరోయిన్ లతో పెదవి ముద్దుల్లోనైనా....ఇంటిమేట్ సన్నివేశాల్లోనైనా..డబులు మీనింగ్ డైలాగులు వల్లించడంలోనైనా రాజా తగ్గేదేలే.
రవితేజకి మాస్ ఆడియన్స్లో అంతటి గుర్తింపు ను తీసుకొచ్చిన వాటిలో ఈ అంశాలన్నీ కీలకంగా ఉన్నవే. అందులోనూ ఇటీవల కాలంలో హీరోయిన్లతో ముద్దు సన్నివేశాలతో వార్తల్లో అగ్ర పథాన్నే నిలబడుతున్నాడు. ఆ మధ్య రిలీజ్ అయిన 'ఖిలాడీ' సినిమాలో ఇద్దరి హీరోయిన్లతో పెదవి సన్నివేశాల్లో ఏ రేంజ్ లో పెర్పార్మెన్స్ ఇచ్చాడో తెలిసిందే.
తెలుగు నటి డింపుల్ హయాతి ..మీనాక్షి చౌదరిలతో హాట్ హాట్ సన్నివేశాల్లో తన మార్క్ వేసాడు. అటుపై 'రామారావు ఆన్ డ్యూటీ'లోనూ దివ్యాంశ కౌశిక్ తోనే ఓ రేంజ్ చెలరేగాడు. దీంతో రవితేజ ముద్దుల వరద ఇప్పట్లో ఆగేలా లేదని సోషల్ మీడియాలో వైరల్ గానూ మారాడు. ఈ నేపథ్యంలో 21 ఏళ్ల శ్రీలీలతో 54 ఏళ్ల రవితేజ ముద్దు సన్నివేశాల్లో చెలరేగాడా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల నటిస్తుంది. ఆమెని సినిమా కోసం ఏరికోరి మరీ భారీ పారితోషికం ఇచ్చి మరీ తీసుకొచ్చారు. పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదని భావించి సీన్లోకి తెచ్చారు. ఈనేపథ్యంలో రవితేజ-శ్రీలీలకి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు..పెదవి ముద్దులకు ఏ మాత్రం కొదవ ఉండదని ఓ సెక్షన్ ఆడియన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.
కానీ రవితేజ..శ్రీలీల తో అలాంటి సన్నివేశాల్లో ఎక్కడా నటించలేదని ఓ వార్త వినిపిస్తుంది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం సహా ..దర్శకుడు థ్రినాధరావు అలాంటి సన్నివేశాల జోలికి వెళ్లే దర్శకుడు కాదని గత ట్రాక్ చూస్తే తెలుస్తోంది.
అలాగే రవితేజ హీరోయిన్లతో ముద్దు సీన్లలో నటించిన సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో అతనిలో కూడా మార్పులొచ్చి ఉంటాయని మరికొంత మంది భావిస్తున్నారు. మరి మార్పులొచ్చాయా? లేదా? అన్నది ధమాకా రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.