మాస్ మహారాజా ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?

Update: 2020-10-15 13:30 GMT
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క్రాక్'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 'రాక్షసుడు' డైరెక్టర్ రమేష్ వర్మతో రవితేజ ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడు. హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కోనేరు హవీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ప్రస్తుతం 'రాక్షసుడు' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్న రమేష్ వర్మ.. అది కంప్లీట్ అయిన వెంటనే రవితేజ సినిమా స్టార్ట్ చేస్తారు. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి ప్రణాళిక వేసుకున్న రవితేజ.. లాక్ డౌన్ లో కొత్త కథలు విన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

'ప్రతిరోజూ పండగే' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత డైరెక్టర్ మారుతి ర‌వితేజ‌తో మూవీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కాన్సెప్ట్ కొత్త‌గా వుండ‌టంతో రవితేజ వెంటనే ఓకే చేశార‌ని.. లాయర్ గా కనిపించనున్నాడని అన్నారు. అయితే ఇప్పుడు ఈ న్యూస్ నిజమే అనేలా మాస్ మహారాజా ఈ ప్రాజెక్ట్ కి పచ్చజెండా ఊపారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మించనున్నారని సమాచారం. ఈ నిర్మాణ సంస్థలు గతంలో మారుతి దర్శకత్వంలో 'భలే భలే మగాడివోయ్' 'మహానుభావుడు' చిత్రాలను రూపొందించాయి. రవితేజ - మారుతి ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News