'ఆర్ ఆర్ ఆర్‌' లాభాల‌కు గండి ప‌డిన‌ట్టేనా?

Update: 2022-01-03 07:41 GMT
రాజ‌మౌళి తెర‌కెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్‌ చిత్రమిది. దీంతో ఈ మూవీపై స‌ర్వ‌త్రా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ వుండ‌టంతో అభిమానుల‌తో పాటు సినీ ప్రియులు భార‌తీయ తెర‌పై హాలీవుడ్ త‌ర‌హా ఎక్స్‌పీరియ‌న్స్ ని క‌లిగించే సినిమాని చూడ‌బోతున్నామ‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూడ‌టం మొద‌లుపెట్టారు.

తెలుగుతో పాటు 14 భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. ప్రాచారాన్ని కూడా భారీ స్థాయిలోనే హోరెత్తించారు. ఏకంగా 20 కోట్లు ప్ర‌చారానికే కేటాయించ‌డం కూడా ఇండస్ట్రీ వ‌ర్గాల్లో `ఆర్ ఆర్ ఆర్ ` టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది. నార్త్ లో ప్రేక్ష‌కుల్ని ఆకర్షించ‌డం కోసం రాజ‌మౌళి ముంబైలో భారీ ఈవెంట్ ని కూడా నిర్వ‌హించి అక్క‌డి వారి అటెన్ష‌న్ ని గ్రాబ్ చేయ‌గ‌లిగారు. అంతా ఓకే ఇక ద‌క్షిణాదిలో ప్ర‌చారం స్పీడ‌ప్ చేయాల‌ని అడుగులు వేస్తున్న నేప‌థ్యంలో `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ వాయిదా అంటూ పిడుగులాంటి వార్త .

ఒమిక్రాన్‌, కోవిడ్ మ‌ళ్లీ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఉత్త‌రాది రాష్ట్రాలు క్ర‌మ క్ర‌మంగా నైట్ క‌ర్ఫ్యూని విధిస్తున్నామంటూ ప్ర‌క‌టిస్తుండటంతో `ఆర్ ఆర్ ఆర్‌` మేక‌ర్స్ త‌మ సినిమా రిలీజ్ ని మ‌రోసారి వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. 450 కోట్ల బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన సినిమా ఇది. ప్ర‌మోష‌న్స్‌కి ఖ‌ర్చు చేసిన 20 కోట్ల‌తో మొత్తం బ‌డ్జెట్ 470 కోట్ల‌కు చేరింది. ఇక తాజాగా మ‌ళ్లీ రిలీజ్ వాయిదా ప‌డ‌టంతో మ‌రోసారి ప్ర‌మోష‌న్స్ కి ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఇక దీనికి తోడు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వం టికెట్ రేట్లు త‌గ్గించ‌డంతో అది `ఆర్ ఆర్ ఆర్‌`కు మ‌రో భారంగా మారింది. ఇప్ప‌టికే డీల్ కుదుర్చుకున్న డిస్ట్రీబ్యూట‌ర్లు అందులో 30 శాతాన్ని త‌గ్గుచుకోమ‌ని `ఆర్ ఆర్ ఆర్` టీమ్ పై వొత్త‌డి చేస్తున్నార‌ట‌. దీంతో సినిమాకు వ‌చ్చే లాభాల్లో 50 కోట్లు త‌గ్గే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ఇది మేక‌ర్ దాన‌య్య‌కు భారీ లాస్ గా మారే అవ‌కాశం వుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఇక ఉత్త‌రాదిలో పెన్ స్టూడియో రిలీజ్ చేయ‌బోతోంది. ఇందు కోసం గ‌తంలోనే ఒప్పందం చేసుకున్నారు. అయితే రిలీజ్ మార‌డంతో ఆ డీల్ లోనూ మార్పులు వ‌చ్చే అవ‌కాశాలు వున్నాయ‌ని తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌, క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ని ర‌న్ చేస్తున్నారు. అది `ఆర్ ఆర్ ఆర్‌` లాభాల‌పై ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని గ్రహించిన రాజ‌మౌళి సినిమాని అందుకే పోస్ట్ పోన్ చేశార‌ట‌.

అంతే కాకుండా ఇప్ప‌టికే రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చిన ఈ మూవీ మ‌రోసారి వాయిదా ప‌డ‌టంతో వ‌డ్డీలు నిర్మాత‌కు పెను భారంగా మార‌డం ఖాయం అనే మాట‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇండియన్ సినిమా ఆగ‌స్టు వ‌ర‌కు ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోనుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతుండ‌టంతో `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ భ‌య‌ప‌డుతోంద‌ట‌.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో విజువ‌ల్ వండ‌ర్ గా ఇండియ‌న్ స్క్రీన్ పై స‌రికొత్త అనుభూతిని అందించాల‌నుకున్న `ఆర్ ఆర్ ఆర్` కోసం ఆడియ‌న్స్ మ‌రి కొన్ని రోజులు ఓపిక‌గా ఎదురుచూడ‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News