ఇటీవల సీన్ అంతా రివర్సులో ఉంది. బాలీవుడ్ అంటే ఒకప్పుడు గొప్ప.. ఇప్పుడు కాదు. బాలీవుడ్ హీరోలు గొప్ప వాళ్లే అయినా .. ఇప్పుడు కాదు! బాహుబలి ఫ్రాంఛైజీ ఘనవిజయం తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ లో టాలీవుడ్ ఓ వెలుగు వెలుగుతోంది. బాలీవుడ్ కంటే ఎక్కువ సక్సెస్ రేటుతో దూసుకెళుతోంది. ఇటీవలి కాలంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన తొలి ముగ్గురు పాన్ ఇండియా స్టార్లుగా ప్రభాస్- రామ్ చరణ్- ఎన్టీఆర్ క్రేజీ లైనప్ తో దూసుకెళుతున్నారు. మహేష్- పవన్ కూడా ఈ రేసులోకి చేరుతున్నారు. 50 ప్లస్ లో ఉన్న ఖాన్ ల త్రయం లేదా ఖిలాడీ హీరోలతో నటించే కంటే ఇప్పుడు సీన్ లోకి దూసుకొచ్చిన టాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ ని ఎంపిక చేసుకునేందుకు ఎవరూ వెనకాడడం లేదు.
అటు హిందీ దర్శకనిర్మాతలకు ఇప్పుడు తెలుగు హీరోలు కీలకంగా మారుతున్నారు. వారి ఎంపికలు ఇటువైపు మరలాయి. అంతేకాదు.. ఇటీవలి కాలంలో బాలీవుడ్ కథానాయికల ఆలోచనా ధోరణి కూడా మారింది. ఇంతకుముందు దక్షిణాది హీరోల సరసన నటించాలంటే కొంత బెట్టు చేసేవారు. తొలి ఆప్షన్ గా హిందీ పరిశ్రమనే పరిగణించేవారు. ఆ రకంగా చాలా మంది తెలుగు -తమిళంలో ఆఫర్లు వచ్చినా భారీ పారితోషికాలు డిమాండ్ చేసి లైట్ తీస్కునేవారు. కానీ ఇప్పుడలా కాదు. తెలుగు సినిమాలో నటిస్తే వచ్చే క్రేజు వేరుగా ఉంటోంది. పాన్ ఇండియా క్రేజ్ తో వెలిగిపోయేందుకు ఆస్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు అగ్ర హీరోలు భారీ పాన్ ఇండియా లైనప్ తో హిందీ హీరోలకు ఠఫ్ కాంపిటీటర్స్ గా మారారు.
దీంతో దీపిక పదుకొనే- ఆలియా-విద్యా బాలన్ లాంటి అగ్ర కథానాయికలే తెలుగు హీరోల సరసన నటించేందుకు వెనకాడలేదు. మునుముందు చాలామంది అగ్ర హీరోయిన్లు తెలుగు పరిశ్రమవైపు చూస్తున్నారు. తాజా సమాచారం మేరకు సోనాక్షి సిన్హా టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఉందని తెలిసింది. సోనాక్షి ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'హీరామండి'లో తన పనిని ముగించే పనిలో బిజీగా ఉంది. హైదరాబాద్ లో ఈ మూవీ చిత్రీకరణ సాగుతోంది. ఇంతలోనే తదుపరి నందమూరి బాలకృష్ణ సరసన అవకాశం అందుకుందని.. తెలుగు సినిమాలో అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుందని హిందీ మీడియాల్లో కథనాలు వైరల్ అవుతున్నాయి.
నటసింహా నాలుగు దశాబ్ధాల కెరీర్ లో వందకు పైగా సినిమాల్లో నటించారు. అఖండ ఘనవిజయంతో స్పీడ్ మీదున్న బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో వీరసింహారెడ్డి చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి 2023 బరిలో విడుదల కానుంది. తదుపరి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాని డిసెంబర్ లో ప్రారంభించాలని భావిస్తున్నాడు.
ఈ సినిమాలో నటించేందుకు సోనాక్షి సిన్హాకు కాల్ వెళ్లిందని తెలిసింది. ప్రస్తుతం మంతనాలు సాగుతున్నాయిట. నిజానికి సోనాక్షి నిన్హాకు దక్షిణాదిన మొదటి చిత్రం 'హే రామ్'. ఈ తమిళ చిత్రంలో తొలిగా లోకనాయకుడు కమల్ హాసన్ సరసన అవకాశం అందుకుంది. కానీ ఆ సినిమా రకరకాల కారణాలతో విడుదల కాలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'లింగా' చిత్రంలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అనుష్క శెట్టితో కలిసి హైదరాబాద్ లో సోనాక్షి బోలెడంత సందడి చేసింది.
కానీ అది డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత సౌత్ పై సోనాక్షి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక తెలుగులో స్ట్రెయిట్ సినిమాలో నటింపజేయాలని మహేష్ సహా పలువురు హీరోలు ప్రయత్నించినా సోనాక్షి అప్పట్లో నో చెప్పిందని కథనాలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ అమ్మడు బెట్టు వీడింది. తెలుగు హీరోల సరసన నటించడానికి ఓకే చెబుతోందిట. ఏకంగా సీనియర్ హీరో అయిన బాలయ్య సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది ఫిలింనగర్ గుసగుస. అయితే దీనిని చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
టైముకి గమ్యం చేరుకునే రైలు ఎక్కేందుకు ప్రయాణీకులు ఆసక్తిగా ఉంటారు. అలాగే సక్సెస్ గ్యారెంటీ అనుకున్న పరిశ్రమలోనే నటించేందుకు నటీమణులు సిద్ధంగా ఉంటారు. ఇటీవల బాలీవుడ్ సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. దీంతో చూపులన్నీ మనవైపే. జక్కన్న కృషి పుణ్యమా అని మైండ్ సెట్ లు మారుతున్నాయి. పాన్ ఇండియా మైండ్ సెట్ తో ఇప్పుడు ప్రతిదీ యూటర్న్ తిరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.