`సైరా` వారం వాయిదా నిజ‌మా?

Update: 2019-08-29 08:20 GMT
రెండు భారీ చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అంటే అది ఇరువ‌ర్గాల‌కు ఇబ్బందేన‌ని చెప్పాలి. ఒకేరోజు రిలీజైతే ఆ మేర‌కు బాక్సాఫీస్ వ‌సూళ్ల ప‌రంగా షేరింగ్ త‌ప్ప‌డం లేదు. దాంతోపాటే తొలి ఆట‌ టాక్ ని బ‌ట్టి ఆ త‌ర్వాత క‌లెక్ష‌న్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. బావుంది .. బాలేదు.. హిట్టు.. ఫ‌ట్టు.. డిజాస్ట‌ర్.. ఇలా ర‌క‌ర‌కాల రివ్యూలు రిలీజ్ డే మోర్నింగ్ షోల టైముకే వ‌చ్చేస్తున్నాయి కాబ‌ట్టి మ‌రుస‌టి రోజునుంచే టికెట్ విండోపై ఆ ప్ర‌భావం ప‌డిపోతోంది. అందుకే భారీ చిత్రాల్ని సోలోగా పోటీ లేకుండా రిలీజ్ చేయ‌డ‌మే సముచితం అని భావిస్తున్నారు. ఆ కోవలోనే  `సైరా-న‌ర‌సింహారెడ్డి` రిలీజ్ విష‌య‌మై నిర్మాత‌లు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.  

అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి కానుక‌గా `సైరా` చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే అదే రోజు బాలీవుడ్ చిత్రం `వార్` రిలీజ‌వుతోంది. ఇవి రెండూ భారీ బ‌డ్జెట్ చిత్రాలే కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద క్లాష్ రాకూడ‌ద‌ని బాలీవుడ్ ట్రేడ్ భావిస్తోంద‌ట‌. ఆ మేర‌కు పంపిణీదారులు- బ‌య్య‌ర్ల నుంచి ఒత్తిడి నెల‌కొంద‌ని.. దీంతో `సైరా` ను వారం పాటు వాయిదా వేసేందుకు ఆలోచిస్తున్నార‌ని ఓ టాక్ వినిపించింది. హృతిక్- టైగ‌ర్ ష్రాఫ్ క‌థానాయ‌కులుగా న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం `వార్` తో పోటీ ప‌డ‌కుండా `సైరా`ను అక్టోబ‌ర్ 8 లేదా 9 నాటికి వాయిదా వేయాల్సిందిగా అభ్య‌ర్థించార‌ని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేష‌కుడు కోమ‌ల్ న‌హ‌తా ట్వీట్ చేయ‌డం.. ఆ త‌ర్వాత వెంట‌నే ఆ ట్వీట్ ని తొల‌గించ‌డం హాట్ టాపిక్ గా మారింది.


అయితే ఇప్ప‌టివ‌ర‌కూ `సైరా` చిత్రాన్ని వాయిదా వేస్తున్నామ‌ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ కానీ.. ఉత్త‌రాదిన హిందీ వెర్ష‌న్ ని రిలీజ్ చేస్తున్న పంపిణీదారులు ఫ‌ర్హాన్ అక్త‌ర్  కానీ ప్ర‌క‌టించ‌నే లేదు. ఒక‌వేళ వాయిదా నిజ‌మే అయితే నిర్మాత‌లే ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చే వ‌ర‌కూ వాయిదా లేద‌నే భావించాల్సి ఉంటుంది. `సాహో` త‌ర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీగా `సైరా` గురించి అటు ఉత్త‌రాది జ‌నాల్లోనూ ప్ర‌స్తుతం చ‌ర్చ సాగుతోంది. సైరా మేకింగ్ వీడియో.. టీజ‌ర్ తో అనూహ్యంగా హైప్ పెరిగింది. అంత భారీ చిత్రం వాయిదా వేస్తున్నారు అంటే దానికి స్ప‌ష్ఠ‌త అట్నుంచి వ‌చ్చే వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News