హీరోయిన్స్‌ కు ఆ స్థాయి పారితోషికం సాధ్యమా?

Update: 2021-07-06 10:30 GMT
రంగం ఏదైనా మగవాళ్ల పారితోషికాలతో పోల్చితే ఆడవారి పారితోషికం తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల పారితోషికంతో పోల్చితే హీరోయిన్స్ పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. చిన్న హీరో పారితోషికం చిన్న హీరోయిన్ పారితోషికం కంటే మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. ఇక స్టార్‌ హీరోయిన్ పారితోషికంతో పోల్చితే స్టార్‌ హీరో పారితోషికం కూడా మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్స్ ఈ విషయంలో మొదటి నుండి కూడా ఫైటింగ్‌ చేస్తున్నారు. ఈ మద్య కాలంలో మళ్లీ ఆ విషయమై చర్చ మొదలైంది.

సౌత్‌ నుండి వెళ్లి బాలీవుడ్‌ లో బిజీ అయిన తాప్సి వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవల ఒక సినిమా విడుదల సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నాతో కెరీర్ ను ఆరంభించిన హీరో ఇప్పుడు నా కంటే మూడు నాలుగు రెట్ల అధిక పారితోషికం తీసుకుంటున్నాడు. ఇలా ఎందుకు అన్నట్లుగా ఆమె ప్రశ్నించింది. తాప్సి మొదలు పెట్టిన ఈ చర్చ మళ్లీ బాలీవుడ్‌ లో మొదలైంది. తాప్సి వ్యాఖ్యలతో పాటు సోనమ్‌ కపూర్‌ కూడా ఈ విషయమై స్పందించింది. పారితోషికం విషయంలో ఎందుకు ఇంత వ్యత్యాసం అంటూ ఆమె ప్రశ్నిస్తుంది. మెల్ల మెల్లగా ఈ చర్చ పతాక స్థాయికి చేరే అవకాశం ఉంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ వందల కోట్లు వసూళ్లు రాబట్టే హీరోయిన్స్‌ కు కూడా సాదారణ పారితోషికం ఇవ్వడం ఏంటీ అనేది కొందరు హీరోయిన్స్ ప్రశ్న.

కొన్ని సినిమాల్లో హీరోలతో సమానమైన పాత్రలను హీరోయిన్స్ చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా హీరోల కంటే చాలా చాలా తక్కువ పారితోషికంను హీరోయిన్స్ తీసుకుంటున్నారు. కొన్ని సినిమాల్లో హీరోలను మించిన పాత్రలు ఉంటున్నాయి. అయినా కూడా పారితోషికం విషయంలో గౌరవం లేదు అంటూ కొందరు హీరోయిన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ అంతరం అనేది తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు. కాని ఈ అంతరం విషయంలో గ్యాప్‌ పెరుగుతుంది కాని తగ్గడం లేదు. ఒక కమర్షియల్‌ హీరో వంద కోట్ల పారితోషికం తీసుకుంటూ ఉంటే అదే సినిమాలో నటించిన హీరోయిన్‌ కు కనీసం పది కోట్ల పారితోషికం కూడా దక్కడం లేదు.

ఈ అంతరం బాలీవుడ్ లో కంటే సౌత్ లో ఎక్కువ ఉంది అనేది అందరికి తెల్సిందే.  ఈ విషయంలో ఒక నిర్మాత మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అనేది ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా పురుష ఆధిక్య ఇండస్ట్రీ. ఇక్కడ సినిమాలు ఆడేది ఎక్కువ శాతం హీరోల వల్లే. వందల సినిమాలు వస్తే అందులో 90 కు పైగా హీరోల సినిమాలే వస్తున్నాయి. కనుక ప్రేక్షకులు ఆ సినిమానే ఇష్టపడుతున్నారు. పది సినిమాలు లేడీ ఓరియంటెడ్‌ వస్తే అందులో ఒకటి రెండు మాత్రమే కమర్షియల్‌ సక్సెస్‌ లను దక్కించుకుంటున్నాయి. సక్సెస్‌ రేటు తక్కువ ఉంది కనుక వారి పారితోషికం తక్కువ ఉంటుందని.. హీరోలతో పోల్చితే హీరోయిన్స్ రిస్క్ చాలా చాలా తక్కువ ఉంటుంది అలాగే  వారి మార్కెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కనుక సమాన పారితోషికం అనేది ఆచరణ సాధ్యం కాదని అనధికారికంగా ఆ నిర్మాత అంటున్నాడు.
Tags:    

Similar News