కొత్తతరం ఏదైనా ట్రై చేస్తుంటే ఎంకరేజ్ చేసేందుకు ప్రేక్షకులు వెనకాడడం లేదు. కానీ ఆశించిన రిజల్ట్ అందుకోలేక చతికిలబడితే అది జనం తప్పు కాదు. ఈ శుక్రవారం రిలీజైన ప్లేబ్యాక్ సన్నివేశం అదే అన్న టాక్ వినిపిస్తోంది. దినేష్ తేజ్- అర్జున్ కళ్యాణ్- స్పందన తారాగణంగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో ప్రసాదరావు పెడ్డినేని నిర్మించిన ప్లేబ్యాక్ మార్చి 5న రిలీజైంది. కొత్తగా ట్రై చేసినా విజువల్ గా మెరిపించలేకపోవడమే టీమ్ తప్పిదం అన్న విమర్శలు వినిపిస్తున్నాయ్.
డజను సినిమాల నడుమ రిలీజైన ఈ సినిమాపై క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ఎవరికీ తెలీని థీమ్ ని ఎంచుకున్నామని ప్లేబ్యాక్ టీమ్ భావిస్తున్నా.. ఇది డార్క్ అనే నెట్ ఫ్లిక్స్ సిరీస్ సీజన్ -1 ప్రేరణతో తీసిన సినిమా ఇదని చెబుతున్నారు.
రెండు విభిన్న కాలాలు అన్న థీమ్ తో విచిత్రమైన కథాంశం.. సైద్ధాంతిక మెటాఫిజిక్ తో అనుసంధానిస్తూ తీసిన ఈ సినిమా వింతగా ఉందన్న టాక్ వచ్చింది. ప్లే బ్యాక్ లో ఆ సిరీస్ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. 2019 లో నివసించే ఒక వ్యక్తి 1993 నుండి ల్యాండ్ ఫోన్ లో ఒక మహిళ కు పరిచయమవుతాడు. రెండు కాలాల్లో ఉన్నవాళ్లు ఫోన్ లలో మాట్లాడుకోవడం.. ఆ తర్వాత థ్రిల్లింగ్ డ్రామా నేపథ్యంలో సినిమా ఉంటుంది. సరదా సస్పెన్స్ థ్రిల్ నేరాలతో కథనం సాగుతుంది. కొన్ని వెర్రి కారణాలు చూపించినా.. కేవలం సిద్ధాంతం ప్రకారం ఈ కథను వివరించే సౌలభ్యం కోసం శాస్త్రీయతను తుంగలో తొక్కడమే ఆశ్చర్యపరుస్తుంది.
క్యారెక్టర్ లు అవే.. కానీ నేరుగా డార్క్ నుంచి ఎంచుకున్నారనే అనిపిస్తుంది. గతాన్ని మార్చడానికి ప్రయత్నించవద్దు అనే థీమ్ లైన్ ని అనుసరించారని అర్థమవుతుంది. అయితే ఇది స్థానిక నేటివిటీతో తెలుగు ప్రేక్షకులకు భిన్నమైన అనుభవాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేయడాన్ని ప్రశంసించాలి. అయితే విజువల్ గా పేలవంగా తీయడమే నీరసం కలిగిస్తుంది. ప్రధాన మహిళా ప్రధాన పాత్ర అనన్య బాగుంది. స్పందన ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దినేష్ తేజ్ తన వంతు పాత్ర పోషించారు. ఇతర సంగతులు సోసోనే. ఈ కాంపిటీషన్ లో థియేటర్లలో ఏమేరకు వర్కవుటవుతుందో చూడాలి.