డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ తెరకెక్కించిన సాహో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని విజువల్ ఎఫెక్ట్స్ భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కించినా క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకోవడంలో తడబడింది. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే .. దర్శకత్వంలోని లోపాలపై విమర్శకులు గురి పెట్టడం సుజీత్ కి మైనస్ అయ్యింది. అయినా తక్కువ ఏజ్ లో అసాధారణ బడ్జెట్ తో అత్యంత భారీ చిత్రాన్ని కొన్ని బ్లాక్స్ లో ఎంతో సమర్థంగా తెరకెక్కించాడన్న పాజిటివ్ ప్రశంస కూడా సుజీత్ పై ఉంది.
రన్ రాజా రన్ చిత్రంతో హిట్టందుకున్న వన్ ఫిలిం వండర్ కిడ్ కి అంత పెద్ద ఆఫర్ ఇచ్చిన డార్లింగ్ భారీ సాహసం చేశారు. సుజీత్ తన ప్రయత్నం విరమించకుండా సాహసించాడు. అయితే సాహో వైఫల్యం అతడికి పెద్ద మైనస్ అయ్యింది. ఇంతకుముందు చరణ్ .. చిరంజీవి లాంటి స్టార్లతో సినిమాల కోసం ప్రయత్నించినా కుదరలేదు.
అయితే ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా సుజీత్ కి మరోసారి డార్లింగ్ ప్రభాస్ అవకాశం కల్పించారు. అత్యంత భారీ చిత్రానికి పని చేసే అవకాశం కల్పించాక అతడి పనిలో శ్రద్ధ ప్రభాస్ కి ఎంతో నచ్చింది. భయపడకుండా అంత పెద్ద బడ్జెట్లను గ్రాఫికల్ వర్క్ ని టెక్నికల్ గా హ్యాండిల్ చేసిన తీరు నచ్చిందట. అందుకే ఇప్పుడు మరో ఆఫర్ ని ఇచ్చారు. సుజీత్ ప్రస్తుతం ప్రభాస్ కోసం స్క్రిప్టుని రెడీ చేస్తున్నారు. ప్రభాస్ కంటే ముందే చిరంజీవి ఈ తరహాలో ఫ్లాప్ దర్శకుడికి కూడా పిలిచి అవకాశం ఇచ్చేవారు. కానీ సమర్థతను చూసేవారు. ఇప్పుడు ప్రభాస్ కూడా నమ్మి మరో ఛాన్సిస్తున్నారు. ఆసక్తికరంగా చిరంజీవి మావయ్య లానే సాయిధరమ్ కూడా ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ కోసం రెండేళ్లు ఆగాలి!
ప్రభాస్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఓవైపు ఆదిపురుష్.. మరోవైపు సలార్.. ఈ రెండిటి నడుమ ప్రాజెక్ట్-కె ప్రారంభమైంది. ప్రభాస్ నాన్ స్టాప్ షెడ్యూల్స్ ఆశ్చర్యపరుస్తున్నాయి. రాధేశ్యామ్ చిత్రాన్ని 2022 సంక్రాంతికి వాయిదా వేసి రిలాక్స్ డ్ గా మూడు సినిమాల చిత్రీకరణలతో బిజీ అయ్యాడు డార్లింగ్. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ 3డి.. సలార్ చిత్రీకరణల కోసం అటూ ఇటూ హడావుడిగా ప్రయాణిస్తున్నారు.
మరోవైపు ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నటించే రెండవ హిందీ ప్రాజెక్ట్ సిద్ధార్థ్ ఆనంద్ తోనే ఉంటుందని బలంగా కథనాలొస్తున్నాయి. ఇటీవల ప్రభాస్ - సిద్ధార్థ్ నడుమ పలుదఫాలుగా చర్చలు సమావేశాలు పూర్తయ్యాయి. ఇక ప్రాజెక్ట్ ఖాయమైనట్టేనని అంతా భావించారు. తాజా సమాచారం మేరకు ప్రభాస్ 24 కోసం రంగం సిద్ధం చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రకటన సెప్టెంబర్ లో ఉంటుందని కథనాలొస్తున్నాయి. ప్రభాస్ ఈ చిత్రంలో రా ఏజెంట్ గా కనిపిస్తాడని మైత్రి మూవీమేకర్స్ పాన్ ఇండియా కేటగిరీలో నిర్మించేందుకు దాదాపు 300కోట్ల బడ్జెట్ ని పెట్టనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ తో ఒప్పందాన్ని ఖరారు చేసుకుని అతనికి మైత్రి సంస్థ అడ్వాన్స్ కూడా చెల్లించింది. దీనికి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యేందుకు మరో మూడు సంవత్సరాలు పట్టొచ్చని అంచనా. అప్పటి వరకూ సుజీత్ వేచి చూడాల్సి ఉంటుంది. అయితే సుజీత్ ఈలోగానే వేరొక హీరోతో సినిమా చేసి నిరూపించుకోవాల్సి ఉంటుంది.