చాలా మంది స్టార్స్ మీడియా ముందు ఒకలా.. సినిమాల్లో మరోలా.. మాట్లాడటం చూస్తుంటాం. అయితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాత్రం అందులో పూర్తిగా భిన్నం. ఎందుకంటే తను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ 'పెళ్లి చూపులు' నుంచి తను ఏ బాయ్ నెక్స్ట్ డోర్ లా పక్కింటి అబ్బాయిలా.. మన ఇంట్లో వ్యక్తిలా మాట్లాడుతూ వచ్చాడు. కెమెరా ముందు ఎంత జెన్యూన్ గా వుండటానికి ఇష్టపడ్డాడో అదే స్థాయిలో మీడియా ముందు కూడా అదే నిజాయితీతో వాళ్లలో ఒకడిగానే వ్యవహరిస్తూ వచ్చాడు.
అది క్రమ క్రమంగా విజయ్ దేవరకొండ గురించి తెలియని వాళ్లకు అది అతని యాటిట్యూడ్ గా అనిపించడం మొదలైంది. విజయ్ దేవరకొండ మీడియా, సెలబ్రిటీస్, ఫ్యాన్స్ ఎవరి ముందైనా ఫ్యామిలీ ఫ్రెండ్ గా, మనలో ఒకడిగా అదే పంథాలో మాట్లాడటం అలవాటు. అదే అతన్ని యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఆ క్లోజ్ నెస్ నచ్చడం వల్లే అతన్ని యూత్ భారీ స్థాయిలో ఓన్ చేసుకోవడం మొదలు పెట్టారు. భారీ స్థాయిలో విజయ్ దేవరకొండకు వీరాభిమానులయ్యారు. దాని వల్లే విజయ్ యూత్ లో క్రేజీ రౌడీ స్టార్ గా నిలడ్డాడు ప్రతీ ఒక్కరికీ చేరువయ్యాడు.
ఇదిలా వుంటే విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'లైగర్' సమయంలో నిర్వహించిన తెలుగు మీడియా సమావేశంలో విజయ్ దేవరకొండ వ్యవహరించిన తీరుపై కొంత మంది నెటిజన్ లు విమర్శలు చేయడం. భారీ అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' ఆశించిన విజయాన్ని అందించకపోగా భారీ డిజాస్టర్ గా నిలవడంతో ట్రోలింగ్ మరీ ఎక్కువైంది. అతని యాటిట్యూడ్ వల్లే సినిమా పోయిందని కొంత మంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు కూడా.
సైమా వేదికగా విజయ్ దేవరకొండ 'లైగర్'పై తొలిసారి స్పందించిన విషయం తెలిసిందే. సైమా వేడుకల్లో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 'లైగర్'పై స్పందించిన విజయ్ దేవరకొండ 'గొప్ప సినిమాలతో ఈ ఏడాది చిత్ర పరిశ్రమను మీరు ముందుకు తీసుకువెళ్లారు. నేను కూడా ప్రయత్నించా. కష్టపడి పని చేశా. కానీ ఆ కష్టం సరిపోలేదు. మనందరికి మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి. ఎలాంటి రోజుల్లో అయినా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులన్నింటినీ పూర్తి చేయాలి' అని స్పందించాడు.
దీంతో చాలా మంది చాలా రకాలుగా విజయ్ మారిపోయాడని, తనలో ఆ యాటిట్యూడ్ కనిపించడం లేదని కామెంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా 'నువ్వేం తగ్గకు అన్నా.. 'ఖుషీ'తో గట్టిగా కొడదాం' అని కామెంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా 'లైగర్' తరువాత విజయ్ లో వినయం పెరిగిందని పోస్ట్ లు పెడుతున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం మరిచిపోతున్నారు. విజయ్ కెరీర్ తొలి నాళ్ల నుంచి ఇదే తరహాలో మాట్లాడుతూ తన సహజమైన నిజాయితీని ప్రదర్శిస్తున్నాడని, తన సహజ ధోరణిలో మాట్లాడితే యాటిట్యూడ్ అంటున్నారని, ఇప్పడు మాట్లాడటం లేదు కాబట్టి సైలెంట్ అయ్యాడంటున్నారు.
విజయ్ ఒరిజినాలిటి అదే. ఎక్కడైనా తన పంథాలోనే మాట్లాడతాడు. అదే అతని క్యారెక్టర్.. ఫ్లాప్ వచ్చింది కదా అని క్యారెక్ట్ మారిపోతుందా? విజయ్ దేవరకొండ ఒరిజినాలిటీ ఎక్కడా తగ్గలే!' అని ఫ్యాన్స్ అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.