కాలం కొంచెం వెనక్కు వెళ్లి ఫ్లాష్ బ్యాక్ లోకి అడుగు పెడితే నువ్వే కావాలి అనే సినిమా ఒకటి కనిపిస్తుంది. స్టార్స్ లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ లవ్ స్టోరీ హైదరాబాద్ లోనే రెండువందల రోజులు నాన్ స్టాప్ గా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడిందంటే ఏ రేంజ్ హిట్టో అర్థం చేసుకోవచ్చు. దెబ్బకు హీరో తరుణ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కుప్పలకొద్దీ అవకాశాలు. ఎంత వేగంగా వచ్చాయో అంతే వేగంగా పరిశ్రమ నుంచి తప్పుకున్నాడు.
ఇక నువ్వు నేను ఒక చరిత్ర. ఉదయ్ కిరణ్ కు యూత్ లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టిన సినిమా. తర్వాత ఎన్నో చేశాడు కానీ ఏదీ అందులో సగం స్థాయి సక్సెస్ కూడా కాలేక అవకాశాలు తగ్గిపోయి బాధాకరమైన స్థితిలో లోకాన్ని వదిలాడు. ప్రేమదేశం టైంలో వినీత్ అబ్బాస్ అంటే కుర్రాళ్లకు పిచ్చి. కొత్త బంగారు లోకం టైంలో వరుణ్దం సందేశ్ డిమాండ్ మాములుగా ఉండేది కాదు. ఇదంతా గత చరిత్ర. వీళ్ళను వన్ మూవీ లేదా వన్ డే వండర్స్ చెప్పుకోవచ్చు
ఇప్పుడీ ముప్పు ఇండస్ట్రీలో కొందరు కుర్ర హీరోలకు ఉందనే టాక్ వినిపిస్తోంది. కారణం ఎంత హిట్టు కొట్టినా మార్కెట్ మాత్రం ఏ మాత్రం పెరగకపోవడం. ఉదాహరణకు శ్రీవిష్ణు క్రమం తప్పకుండా అడపాదడపా హిట్లు కొడుతూనే ఉన్నాడు. కానీ రేంజ్ పెరగడం లేదు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో మెప్పించిన నవీన్ పోలిశెట్టికి అన్ని ఇలాంటి కథలే రావు కాబట్టి ఇప్పటిప్పుడు ఫ్యూచర్ గురించి చెప్పలేం.
ఆరెక్స్ 100 సెటిల్ అయ్యాడు అనుకున్న కార్తికేయ రెడ్డికే హిప్పీ ఫలితం జ్ఞానోదయం కలిగించింది. ఈ కారణాల వల్లే ఇలాంటి హీరోలు హిట్లు కొడుతున్నా వాళ్ళ నెక్స్ట్ మూవీస్ ని డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ పెట్టి కొనేందుకు ముందుకు రావడం లేదట. రిస్క్ గురించి ఆలోచించి మునుపటి సినిమా రేట్లకే అడుగుతున్నారట. అందుకే సక్సెస్ కనపడుతున్నా వీళ్లకు బాక్స్ ఆఫీస్ లెక్కల్లో మాత్రం అద్భుతాలు జరగడం లేదు. సక్సెస్ ట్రాక్ కంటిన్యూగా ఉంటేనే స్టార్ హీరోలకు సైతం కష్టాలు తప్పడం లేదు. అలాంటిది ఈ యూత్ హీరోలు కష్టపడాల్సింది చాలా ఉంది మరి.