మీటూను ఇలాగేనే వాడేది?

Update: 2019-10-25 08:12 GMT
హిందీ సీరియల్స్‌ తెలుగులో డబ్‌ అయ్యి ప్రసారం అవుతూ ఉంటాయి. బాలికా వధు సీరియల్‌ తో బాగా ఫేమస్‌ అయిన సిద్దార్థ్‌ శుక్లా మరియు కోడలా కోడలా కొడుకు పెళ్లామా సీరియస్‌ తో తెలుగు వారిలో మంచి గుర్తింపు దక్కించుకున్న దేవోలినాలు ప్రస్తుతం హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 13లో ఉన్నారు. వీరితో పాటు ఇంకా పలువురు సీరియల్‌ ఆర్టిస్టులు ఉన్నారు. ఈ షో ఆరంభం అయినప్పటి నుండి కూడా సిద్దార్థ్‌ శుక్లాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈయన ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

బిగ్‌ బాస్‌ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు కూడా సిద్దార్థ్‌ పై లైంగిక వేదింపుల ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బిగ్‌ బాస్‌ లో దేవోలినాను ఒక టాస్క్‌ సందర్బంగా పట్టుకునేందుకు సిద్థార్థ్‌ ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమె చాలా సీరియస్‌ అయ్యింది. నన్ను పట్టుకునేందుకు వస్తే చాలా సీరియస్‌  గా ఉంటుంది. నన్ను టచ్‌ చేయవద్దంటూ అతడిని హెచ్చరించింది. ఒక వేళ టాస్క్‌ పేరుతో నన్ను టచ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే లైంగిక వేదింపుల ఆరోపణలు చేసి మీటూ కేసు పెడతానంటూ వార్నింగ్‌ ఇచ్చింది.

ఆటలో తాకడం కొన్ని సార్లు తప్పదు. కాని అతడు తప్పుగా తాకకున్నా కూడా మీటూ ఆరోపణలు చేసి కేసు పెడతాను అనడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని.. అలా ఎవరితో టచ్‌ వద్దనుకున్నట్లయితే బిగ్‌ బాస్‌ లోకి ఎందుకు వెళ్లారు అంటూ దేవోలినాను నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఇంత చిన్న విషయానికి చాలా గొప్ప ఉద్యమం అయిన మీటూను తీసుకు రావడం కూడా కరెక్ట్‌ కాదని ఆమెకు నెటిజన్స్‌ సూచిస్తున్నారు.

ఇదే సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచే వారు కూడా చాలా మందే ఉన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేవోలినా తగిన బుద్ది చెప్పింది అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మద్య గొడవ బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయమై వీకెండ్‌ లో సల్మాన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News