లేడీ సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న నయనతా రపై నిర్మాతలకు చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆమె ప్రమోషన్స్ కు హాజరు అవ్వదు. ఇచ్చిన డేట్లలో కాకుండా ఇతర డేట్లలో షూటింగ్ కు రమ్మంటే అదనపు పారితోషికం డిమాండ్ చేయడం తో పాటు పలు చికాకులు పెడుతుంది. ఇక ఆమె పారితోషికం విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. పారితోషికం మాత్రమే కాకుండా ఆమె స్టాప్ కు కూడా రోజుకు 50 వేల రూపాయలకు పైగానే నిర్మాతతో పెట్టిస్తుందట.
ఏ సినిమా షూటింగ్ కు ఈమె వెళ్లినా కారు నుండి కార్ వ్యాన్ వరకు అన్ని కూడా నిర్మాత చూసుకోవాల్సిందేనట. ఆమె పర్సనల్ మేకప్ మన్ కు కూడా నిర్మాత నుండి డబ్బులు ఇప్పిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా ఆమె పారితోషికంతో పాటు ఇతర ఖర్చులు కూడా నిర్మాతకు తడిసి మోపెడు అవుతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై తమిళ నిర్మాతల మండలి వద్ద చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
నయనతార తో పాటు ఇకపై హీరోలు హీరోయిన్స్ తమ వ్యక్తిగత స్టాప్ ఖర్చును నిర్మాతలపై మోపకూడదని నిర్మాతల మండలి ఆదేశించనుంది. ఈ నిర్ణయం తప్పిన వారిపై బహిష్కర తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. మండలి హెచ్చరికలతో నయనతార పారితోషికం విషయం లో మరియు ఆమె స్టాప్ పేమెంట్స్ విషయం లో వెనక్కు తగ్గాల్సిందే అంటున్నారు. సినిమాలు తగ్గిన ఈ సమయం లో నయనతార మారకుంటే మరింత ఇబ్బందులు తప్పవంటూ ఇండస్ట్రీ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు.