యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దూ జొన్నటగడ్డ నటించిన తాజా సెన్సేషనల్ మూవీ 'డీజే టిల్లు'. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ద్వారా విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. హైదరాబాదీ స్లాంగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. టీజర్ రిలీజ్ నుంచే అంచనాలు పెంచేసిన ఈ మూవీ ఊహించని స్థాయిలో వసూళ్లని రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అయితే ఈ మూవీలో నటించడమే కాకుండా కథ, మాటలు కూడా అందించాడు హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఈ మూవీలో డీజే టిల్లుగా తను పోషించిన పాత్ర, రాసిన డైలాగ్స్ జనాల్లో భారీ స్థాయిలో పేలాయి. ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం, శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల అందించిన పాటలు ఓ రేంజ్ లో టాప్ హిట్ గా నిలిచి సినిమాకు మరింత బలంగా మారాయి. అత్యంత లో బడ్జెట్ లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 30 కోట్ల మేర వసూళ్లని రాబట్టి చిన్న సినిమాల్లో సంచలనం సృష్టించింది.
ఊహించని స్థాయిలో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి హీరోగా సిద్దూ జొన్నలగడ్డకు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు కూడా. పారిస్ నేపథ్యంలో పార్ట్ 2 ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సీక్వెల్ కు హీరో సిద్ధూ జొన్నలగడ్డనే దర్శకత్వం వహించబోతున్నాడు.
త్వరలోనూ ఈ సీక్వెల్ షూటింగ్ ని ప్రారంభించనున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. తొలి భాగంతో పోలిస్తే పార్ట్ 2 విషయంలో భారీ మార్పులు చేస్తున్నారట.
హీరోయిన్ నేహాశెట్టి పాత్రని కుదించి గెస్ట్ క్యారెక్టర్ కె పరిమితం చేస్తున్నారట. అంతే కాకుండా హీరోయిన్ గా ఓ క్రేజీ గ్లామర్ భామని అన్వేషిస్తున్నారట. అంతే కాకుండా పార్ట్ 2 లో మరిన్ని కొత్త పాత్రలని పరిచయం చేస్తున్నారట. ఇందు కోసం కొత్త నటీనటులని కూడా రంగంలోకి దింపాలనుకుంటున్నారని తెలుస్తోంది.
పార్ట్ 1 లో టిల్లు రాధిక అనే అమ్మాయి ప్రేమలో పడి చేయని హత్య కేసులో ఇరుక్కుంటాడు. అయితే తనని ఇరికించించి గోవా పారిపోయిన రాధికని పట్టించి చివరికి తన నిర్దోషిగా బయటపడతాడు. అయితే రాధిక కొట్టేసిన కోట్ల రూపాయలు పారిస్ లో వున్నయని పార్ట్ 2 కథని అక్కడ స్టార్ట్ చేయబోతున్నారట. దీంతో చాలా వరకు కొత్త పాత్రలు పుట్టుకురానున్నాయని, పార్ట్ 1ని మించి పార్ట్ 2 మరింత కొత్తగా, గ్రాండ్ గా వుండబోతోందని తెలుస్తోంది.