ప్రతిసారీ ఫేజ్ మారుతుంటే దాంతో పాటే గొప్ప అద్భుతాలు జరుగుతాయని సూపర్ స్టార్ కృష్ణ నమ్మేవారు. అదే విషయాన్ని తనకు చెప్పేవారని మహేష్ చాలా సార్లు అన్నారు. బాహుబలి రిలీజ్ తర్వాత వేవ్ ఎంతో మారుతుందని దానివల్ల పరిశ్రమకు మేలు జరుగుతుందని సూపర్ స్టార్ అప్పట్లో ప్రవచించారు. దానికి తగ్గట్టే ఇండస్ట్రీ మారింది. విదేశీ మార్కెట్ నైజాంలాగా మారింది. స్వరాష్ట్రాల్లో బిజినెస్ పెరిగింది.
ఇరుగు పొరుగు మార్కెట్లకు విస్తరించడం ఎలానో నేర్చుకున్నారు. బాహుబలి తర్వాత బాహుబలి ముందు సన్నివేశం ఎలానో.. ఇప్పుడు కరోనా ముందు కరోనా తర్వాత అన్న తీరుగా ఉంటుందా? అంటే ఒక కోణంలో కరోనా చాలా పాఠాల్ని నేర్పించిందని చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం టాలీవుడ్ లో సుమారు 100-150 సినిమాలు విడుదలవుతుంటాయి. 200 సినిమాలు సెట్లలో ఉంటాయి. వాటిలో 15 శాతం సినిమాలు మెగా బడ్జెట్లతో తెరకెక్కుతాయి. అయితే మనవాళ్లు ముందే రిలీజ్ తేదీల్ని ప్రకటించడం అరుదు. కానీ హాలీవుడ్ .. బాలీవుడ్ లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. షూట్ ప్రారంభానికి ముందే వారు తేదీని నిర్ణయిస్తారు. విడుదల తేదీని ప్రకటించి షూట్ ప్రారంభిస్తారు. దీని వల్ల ఇతర చిత్రనిర్మాతలు తమ విడుదల తేదీ ఎంపిక విషయమై క్లారిటీగా క్లాష్ లేకుండా ప్లాన్ చేసుకునే వీలుంటుంది.
ఇలాంటి క్రమశిక్షణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ లేదు. కానీ ఇకపై మారాల్సిన టైమ్ వచ్చేసిందని.. కరోనా సీజన్ తరువాత పరిస్థితి మారుతోందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల పెద్ద సినిమాలకు విడుదల తేదీలు నెలల ముందు ఫిక్స్ చేయడం కనిపిస్తోంది. అయితే నిర్ణీత తేదీ ప్రకారం ఎన్ని సినిమాలు వస్తాయి.. ఎన్ని ఆలస్యం అవుతాయో చెప్పలేం. కనీసం పాన్ ఇండియా సినిమాలు.. పెద్ద బడ్జెట్ సినిమాల రిలీజ్ తేదీల్ని చాలా ముందే ప్రకటిస్తే ఆ మేరకు ఇతరులకు రిలీఫ్ సాధ్యం. మరి మునుముందు ఇంకా సన్నివేశం ఎలా మారనుందో చూడాలి.