తమ్ముడు అల్లుడి కోసం 50 కోట్లా ?

Update: 2019-08-12 06:53 GMT
విక్టరీ వెంకటేష్ నాగ చైతన్యల కాంబోలో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వెంకీ మామ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ లో విడుదల చేసే ప్లాన్ తో ఒకపక్క నిర్మాత సురేష్ బాబు బిజినెస్ డీల్స్ కూడా చేస్తున్నారు. దీనికి సుమారుగా 50 కోట్ల దాకా బడ్జెట్ అయ్యిందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి సురేష్ బాబు ఎంత తమ్ముడైన అల్లుడైనా చాలా క్యాలికులేటెడ్ గా రిస్క్ తగ్గించుకుని తన నిర్మాణంలో సినిమాలను ప్లాన్ చేస్తుంటారు.

ఒకప్పుడు పరిమితులు పెట్టుకునే వారు కాదు కానీ ఇప్పుడు మాత్రం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే సాగుతున్నారు. అందుకే సోలో ప్రొడక్షన్ వదిలేసి జాయింట్ వెంచర్లలోనే పెట్టుబడులు పెడుతున్నారు. వెంకీ మామలో సైతం మరో ఇద్దరు పార్ట్ నర్స్ ఉన్నప్పటికీ మొత్తం అంతా సురేష్ బాబు కనుసన్నల్లోనే జరుగుతోందని వినికిడి. ఇదిలా ఉండగా నిజంగా వెంకీ మామకు 50 కోట్ల బడ్జెట్ అంటే తేలికైన విషయం కాదు. విడిగా వెంకీ చైతులకు అంత షేర్ తెచ్చే మార్కెట్ లేదు.

ఎఫ్2 అంతకు మించే ఇచ్చింది కానీ సంక్రాంతి సీజన్ అక్కడ కీలక పాత్ర పోషించింది. అందులోనూ కామెడీ పార్ట్ బాగా పండటంతో వసూళ్ల వర్షం కురిసింది. వెంకీ మామలో అంతకు మించి ఎంటర్ టైన్మెంట్ యాక్షన్ ఉంటేనే పెట్టుబడి మొత్తం వెనక్కు వస్తుంది. ఏ మాత్రం తేడా వచ్చినా లెక్కలు అటు ఇటు అవుతాయి. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తీసిన యాక్షన్ సీన్స్ కు ఎక్కువ ఖర్చయ్యిందని ఇన్ సైడ్ న్యూస్. నిజంగా యాభై కోట్లు పెట్టారా లేక బిజినెస్ హైప్ కోసం వదులుతున్న ఫీలర్లా తెలియదు కానీ మొత్తానికి వెంకీ మామ పెద్ద గేమే ఆడబోతున్నాడు.
Tags:    

Similar News