నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. అందుకే కార్తికేయ కు సీక్వెల్ గా కార్తికేయ 2 ని రూపొందించారు. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కార్తికేయ 2 సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల హడావుడి మామూలుగా లేదు. చిత్ర యూనిట్ సభ్యులు అన్ని విధాలుగా సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా ఇస్కాన్ టెంపుల్ ను యూనిట్ సభ్యులు సందర్శించి అక్కడ స్వామిజీలకు సినిమా యొక్క ట్రైలర్ ను చూపించడంతో పాటు పోస్టర్ లను చూపించారట. సినిమా యొక్క కథను కూడా వినిపించిన యూనిట్ సభ్యులు ఇస్కాన్ టెంపుల్ లో స్వామిజీలతో మాట్లాడారట. ఆ సమయంలో ఇస్కాన్ టెంపుల్ సహ అధ్యక్షుడు అయిన వ్రిందావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.
ఆయన మాట్లాడుతూ.. సినిమా లో సనాతన ధర్మం గురించి చాలా చక్కగా చెప్పారు. కనుక మన సనాతన ధర్మ గురించి ప్రపంచంకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సినిమా ను ఇంగ్లీష్ లో డబ్ చేసి విడుదల చేయాలని సూచించారట. హాలీవుడ్ ప్రేక్షకుల వరకు ఈ సినిమాను చేరవేస్తే హిందూ సాంప్రదాయం మరియు సనాతన ధర్మ గురించి అందరికీ తెలుస్తుందని ఆయన పేర్కొన్నారట.
సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సినిమా టాక్ ను బట్టి ఇంగ్లీష్ లో విడుదల విషయమై యూనిట్ సభ్యులు ఆలోచించే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమా పై యూనిట్ సభ్యులు చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నారు.
కార్తికేయ సినిమా తో పోల్చితే ఈ సినిమా అంతకు మించి రెట్టింపు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు.
ఈ సినిమా లో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. కీలక పాత్రలో కార్తికేయ 1 లో హీరోయిన్ గా నటించిన స్వాతి రెడ్డి కూడా కనిపించబోతుందనే వార్తలు ఆ మధ్య వచ్చాయి. కాని ఆ విషయంలో యూనిట్ సభ్యుల నుండి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత అంతా కూడా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.