ఎనర్జిటిక్ రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీ `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ సెలబ్రేషన్స్ గురించి తెలిసిందే. ఈ సినిమా క్రిటిక్స్ స్పందనకు భిన్నంగా బాక్సాఫీస్ రిజల్ట్ ను అందుకుంది. ఆ క్రమంలోనే పూరి- ఛార్మి బృందం ఇరు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన నగరాల్లో పబ్లిసిటీని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 61 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించింది. దాదాపు 32 కోట్ల మేర షేర్ వసూలైంది. ఇందులో కేవలం నైజాం నుంచి 8 రోజుల్లోనే 12 కోట్ల మేర షేర్ వసూలైందని తెలుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ ఇకపైనా స్టడీగా వసూళ్లు సాగిస్తే 80 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే వీలుందని టీమ్ అంచనా వేస్తుంది. మెమరీ చిప్ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు ఎక్కింది. మాస్ కి కొంత గ్యాప్ తర్వాత ఈ తరహా ట్రీట్ దక్కడం బాక్సాఫీస్ కి కలిసొచ్చిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్సెస్.. నిధి-నభా నటేష్ గ్లామర్ షో సినిమాకి అస్సెట్ అయ్యింది.
ఈరోజు రిలీజైన దేవరకొండ `డియర్ కామ్రేడ్` ప్రభావం ఇస్మార్ట్ వసూళ్లపై కొంతవరకూ ఉండొచ్చు. మిశ్రమ స్పందనలు వచ్చినా కామ్రేడ్ కి తొలి వీకెండ్ ఓపెనింగుల పరంగా దూకుడు సాగిస్తుంది కాబట్టి ఇస్మార్ట్ శంకర్ పై ఆమేరకు ప్రభావం ఉంటుంది. అలాగే ఆగస్టు 2న అంటే మరో ఆరురోజుల్లో కార్తికేయ నటించిన గుణ 369.. బెల్లంకొండ రాక్షసుడు రిలీజవుతున్నాయి. అప్పటివరకూ ఇస్మార్ట్ శంకర్ సన్నివేశం ఎలా ఉండబోతోంది? అన్నది వేచి చూడాల్సిందే.