ట్రైలర్ టాక్: జమానా అట్లుంది ఏం జేస్తం ఫాలో ఐతం

Update: 2019-07-12 12:18 GMT
పూరి జగన్నాధ్ - రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సెకండ్ ట్రైలర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది.   మొదటి ట్రైలర్ లో ఎక్కువగా యాక్షన్.. మాస్ హీరోయిజంను చూపించడంపై ఫోకస్ చేసిన పూరి ఈ సారి కాస్త బోల్డ్ టాక్.. హీరోయిన్ల స్పైస్ కలిపి ధమ్ బిర్యాని పెట్టేందుకు ట్రై చేసినట్టుంది.  హీరోయిన్ "అరె హౌలే.. ఏం జేస్తున్నవ్ బె బీచ్ ల" అని అడగడం.. "చేపకు బొక్కవెట్టి అందుల పుల్లవెట్టి కింద మంట బెట్టిన" అనగానే నభా లాగి ఒక్కటి పీకడం తో ట్రైలర్ స్టార్ట్.  అసలే స్లాప్ లవ్వుల మీద దేశంలో రచ్చ జరుగుతోంది. ఇది ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఇక నెక్స్ట్ షాట్ లో "షాది కే బాద్.. రోజుకొక్కసారైనా కొట్టాల్రా దీన్ని" అని అంటూ నభను ఉద్దేశించి అంటాడు.   వీరి లవ్ స్టొరీ ఇలా వయోలెంట్ గా ఉంటే మరోవైపు నిధి అగర్వాల్ తో రిలేషన్ కూడా కాస్త హింసతో కూడుకున్నదిగానే ఉంది. నిధి గొంతుగట్టిగా పట్టుకొని "డాక్టర్ వా అని అడుగుతాడు" రామ్..  "న్యూరో సైంటిస్ట్" అని సమాధానం ఇస్తుంది.  ఇవి జస్ట్ శాంపిల్.. ఫుల్లు మసాలా సీన్లు ఇంకా ఉన్నాయి. "పెళ్లిగాక ముందు హనీమూన్ ఏంది? అన్ని నభ అంటే... రామ్ గోముగా సమాధానమిస్తూ "ఈమధ్య ముందు హనీమూన్లు ఐతున్నయే.. ఆతర్వాత పెళ్లి అయితే ఐతది లేకుంటే లేదంట. జమానా అట్లుంది మల.. ఏం జేస్తం ఫాలో ఐతం!" అంటూ షాక్ ఇస్తాడు.

ఓవరాల్ గా ఈ సినిమాలో జస్ట్ ఊరమాస్ యాక్షన్ కాదు.. లౌడ్ కామెడీ కూడా ఉంది. అంతే కాదు విమర్శకులు గొంతు చించుకుని అరిచి అరిచి గీపెట్టి గొంతు నొప్పెట్టి ఈఎన్ టీ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళేంత కంటెంట్ ఉందని పూరి ప్రూవ్ చేశాడు.  ఈ సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేదిగా ఉంది.   ఆలస్యం ఎందుకు..  ఉస్తాద్ శంకర్ నాటు రొమాన్స్ చూసేయండి..

Full View
Tags:    

Similar News