ఇట్స్ ఏ ఫ్యామిలీ డాన్స్ః టీమిండియా క్రికెట‌ర్ జోరు.. వీడియో వైర‌ల్‌!

Update: 2021-03-28 11:30 GMT
మైదానంలో పించ్ హిట్టింగ్ తో చెల‌రేగిపోయే టీమిండియా క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా.. తాను స‌క‌ల క‌ళావ‌ల్ల‌భుడిన‌ని చాటుకుంటున్నాడు. తాజాగా.. ఫ్యామిలీతో క‌లిసి ఓ పాట‌కు స్టెప్పులు ఇర‌గ‌దీశాడు. భార్య న‌టాషా స్టాంకోవిక్, చిన్నారి కొడుకు అగ‌స్త్య‌తో క‌లిసి వేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఎడ్వ‌ర్డో లుజ్క్వినోస్ ఫేమ‌స్ ఆల్బ‌మ్ ‘డోంట్ ర‌ష్‌’ రీమిక్స్ సాంగ్ కు వీరు చిందేశారు. హార్దిక్ కొడుకును రెండు చేతుల్లో ఎత్తుకోగా.. భార్య నటాషా సోలోగా స్టెప్పేసింది. ముఖ్యంగా నటాషా ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్లో పోస్టు చేసింది న‌టాషా. కాగా.. ఈ వీడియో పోస్టు చేయ‌డానికి ముందు ఓ హాట్ హాట్ పిక్ ను కూడా షేర్ చేసింది. భార్యాభ‌ర్త‌లు స్విమ్మింగ్ పూల్ లో జ‌ల‌కాలాడుతుండ‌గా.. భ‌ర్త చెక్కిళ్ల‌ను చుంబిస్తోంది న‌టాషా. మొత్తానికి ఇటు హాట్ పిక్స్‌.. అటు డ్యాన్స్ మూమెంట్స్ తో ర‌చ్చ చేస్తోందీ జంట‌.

Full View

Tags:    

Similar News