ప్రైవేట్ మీటింగ్ అయితే పిలవాల్సిన పని లేదు: తేజ
మెగాస్టార్ చిరంజీవి బృందం తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలపై చర్చించడంపై బాలయ్యను స్పందించమని కోరినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ విషయంపై దర్శకుడు తేజ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
వ్యక్తిగతమైన మీటింగులు అయితే ఎవరూ ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదని.. దానిపై ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. అయితే పరిశ్రమకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయంలో లేదా చర్చించే సమయంలో మాత్రం బాలయ్యనే కాదు.. పరిశ్రమకు ఎవరైతే పిల్లర్ల లాగా ఉంటారో వారినందరినీ పిలవాలని అభిప్రాయపడ్డారు. తేజకు మొదటి నుంచి ముక్కుసూటిగా ఉంటారని.. తన అభిప్రాయం ఏమాత్రం మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారని పేరుంది.
బాలయ్య పరుషంగా మాట్లాడరనే అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పటికీ.. బాలయ్యను పక్కన పెట్టడం వల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని.. పరిశ్రమకు సంబంధించిన ముఖ్యమైన మీటింగ్ కు బాలయ్యను పిలవకపోవడం సరికాదని కొంతమంది ఓపెన్ గానే చెప్తున్నారు.