టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఒక కుమార్తె జన్మించింది. వామిక కోహ్లీ అని నామకరణం చేశారు. ఈ జంట అన్యోన్యతపై అభిమానులకు బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో ప్రేమలో లాక్ అవ్వక ముందే వేరే ఎవరితోనూ ప్రేమలో పడలేదా? అంటే.. కోహ్లీ రొమాంటిక్ లైఫ్ లో పలువురు భామలు ఉన్నారనేది బాలీవుడ్ మీడియా కథనాల సారాంశం.
ఒకప్పుడు బ్రెజిల్ మోడల్ నటి ఇజాబెల్లె లైట్ తో కోహ్లీ డేటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ- ఇజాబెల్లె లైట్ మధ్య ప్రేమ వ్యవహారం ఆ సమయంలో చాలా హాట్ టాపిక్ అయ్యింది. విరాట్ తో దాదాపు రెండేళ్లపాటు డేటింగ్ చేసిన ఇజాబెల్లె ఆ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించడంతో మీడియాలో హైలైట్ అయ్యింది. 2013-2014 మధ్య కాలంలో లవ్ స్టోరి ఇది. కానీ ఆ తర్వాత ఈ జంట బ్రేకప్ అయ్యారు.
ఇజాబెల్లె లైట్ ఫేమస్ బ్రెజిలియన్ మోడల్. మోడలింగ్ ప్రపంచంలో పాపులరై అటుపై అనేక బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. అమీర్ ఖాన్ చిత్రం `తలాష్ - ది ఆన్సర్ లైస్ విత్న్`(2012) చిత్రంతో ఇజాబెల్లె లైట్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
విరాట్ కోహ్లీ - ఇజాబెల్లె 2012 నుండి 2014 వరకు ఒకరితో ఒకరు డేటింగ్ చేసుకున్నారు. ఈ జంట సాన్నిహిత్యం మీడియా దృష్టిని ఆకర్షించింది, కాని ఈ జంట వ్యవహారం చివరకు 2013 లో బహిర్గతమైంది. విరాట్ కోహ్లీతో విడిపోయిన తరువాత ఇజాబెల్లె ఒక ఇంటర్వ్యూలో కోహ్లీతో తన సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడారు. ``అవును.. మేము రెండు సంవత్సరాలు సంబంధంలో ఉన్నాము. ఈ సంబంధం పరస్పర అంగీకారంతో ముగిసింది`` అని చెప్పారు.
ఇజాబెల్లె లైట్ తో విడిపోయిన తరువాత అనుష్క శర్మతో విరాట్ డేటింగ్ ప్రారంభించాడు. కొన్నేళ్ల ప్రేమాయణం అనంతరం ఈ జంట పెళ్లితో ఒకటైన సంగతి తెలిసిందే.