జ‌బ‌ర్ధ‌స్త్ శాల‌రీలు తెలిస్తే షాకే!

Update: 2018-10-12 01:30 GMT
ఊర మాస్ కామెడీ షో అని అనండి!  మేం ఈ కార్య‌క్ర‌మం అస‌లే చూడం!! అని ఈగోల‌కు పోండి! ఎవ‌రికి కావాలి.. బోడి మీ ఆద‌ర‌ణ. ఇది ముందే చెప్పిన‌ట్టు ఊర‌మాస్ షోనే. టీవీల్ని ఆద‌రించే మాస్‌ని ఉద్ధేశించిన షోనే. అందులో ప‌క్కాగా.. క్లియ‌ర్‌ క‌ట్‌ గానే ఉన్నాం. అయినా మా షోని  క్లాస్ చూడాల్సిన ప‌నేలేదు...అని పక్కాగా చెప్పుకుని మ‌రీ ఆ షోని విజ‌య‌వంతం చేసింది ఈటీవీ. ఓవైపు ఇంత ఊర‌మాస్ షోలేంటి? అని విమ‌ర్శించిన వాళ్లే ముక్కున వేలేసుకునేలా ఏళ్ల‌కు ఏళ్లు టీఆర్‌ పీని గుంజుకుంటోంది ఈ షో. ఇంత‌కీ ఏ రియాలిటీ షోనో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. జ‌బ‌ర్ధ‌స్తేనా? అని పెద‌వి విరిచేస్తే అది మీ త‌ప్పు. మీకు అంచ‌నా వేయ‌డం తెలిసింది త‌క్కువే అని నిష్క‌ర్ష‌గా చెప్పొచ్చు.

జ‌బ‌ర్ధ‌స్తేనా? అని అస్స‌లు లైట్ తీస్కోవడానికి లేదు. ఈ షోలో ఉన్న స్టార్ల‌కు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. బుల్లితెర‌పై క‌నిపించి నాలుగైదు స్కిట్‌ లు చేస్తే చాలు సెల్ఫీల కోసం జ‌నం ఎగ‌బ‌డ‌తారు. సోష‌ల్ మీడియాలో స్టార్లు అయిపోయిన‌ట్టే. స‌రిగ్గా ఇదే పాయింట్ ఈ షోలో న‌టించే వాళ్ల‌కు - ఈ షోని డైరెక్ట్ చేసేవాళ్ల‌కు - యాంక‌ర్ల‌కు క్రేజు పెంచుతోంది. ఇప్ప‌టికే జ‌బ‌ర్ధ‌స్త్ షో - ఆ షో నిర్మాత శ్యాంప్ర‌సాద్ రెడ్డి వ‌ల్ల‌నే మాకు ఇంత తిండి దొరికింద‌ని విన‌మ్రంగా చెప్పుకునే క‌మెడియ‌న్లు ఎంద‌రో ఉన్నారు. మొన్న‌టికి మొన్న ష‌క‌ల‌క శంక‌ర్ సైతం తాను క‌మెడియ‌న్‌ గా - అటుపై హీరోగా ఎద‌గ‌డానికి కార‌ణం జ‌బ‌ర్ధ‌స్త్ షో అనే చెప్పాడు. అస‌లింత‌కీ ఈ షోలో న‌టిస్తే పారితోషికం ఎంత‌? అంటే ఇదిగో ఇదే స‌మాధానం.

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా చిన్నా చిత‌కా క‌మెడియ‌న్లు ఎదుగుతున్నారంటే అంత‌టి స్టామినా వీళ్ల‌కు ఉంది కాబ‌ట్టే. వాళ్ల కంటూ సంఘంలో ఓ గౌర‌వం - స్టాట‌స్సు నేడు ఉన్నాయి. హైద‌రాబాద్ లాంటి చోట‌ సొంతంగా ఇల్లు - కార్లు ఉన్నాయి. ఈ షోకి వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించే నాగ‌బాబు - రోజా ఒక్కొక్క‌రు 1.5 ల‌క్ష‌లు చొప్పున రెండేసి స్కిట్‌ లు (రెండ్రోజులు) రూప‌క‌ల్ప‌న చేస్తేనే అందుకుంటున్నారు. డైరెక్ష‌న్ చేసే నితిన్‌-భ‌ర‌త్ ఇద్ద‌రికి 1.5ల‌క్షలు చొప్పున (రెండ్రోజుల షూట్‌ కి) అందుతాయి. ఆరు టీమ్‌ లు ఎడ‌తెరిపి లేని కామెడీ స్కిట్ల‌తో నిరంత‌రం జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మాన్ని ర‌న్ చేస్తున్నాయి. చ‌మ్మ‌క్ చంద్ర‌ - హైప‌ర్ ఆది - అదిరే అభి - రాకెట్ రాఘ‌వ‌ - వెంకీ - ఆర్పీ  ఆరుగురు టీమ్ లీడ‌ర్లు. ఒక్కో టీమ్‌కి 1.5ల‌క్ష‌లు ఎపిసోడ్‌ కి అందుతుంది. తోటి న‌టుల‌కు త‌లో రూ.10వేలు ఇచ్చినా టీమ్ హెడ్‌ కి మినిమంగా రూ.60-80 వేలు దాకా కిట్టుబాటు అవుతుంది. రెండేసి స్కిట్‌ల ఎపిసోడ్స్‌ని రెండ్రోజుల్లోనే పూర్తి చేస్తారు. అలా ప్ర‌తి వారం ఎపిసోడ్లు ప్రిపేర‌వుతూనే ఉంటాయి. అంటే నెల ఆదాయం ఎంత‌?  వార్షికాదాయం ఎంత‌? అన్న‌ది లెక్క గ‌ట్టొచ్చు. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ వేరు. ఎక్ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ వేరు. ఈ టీమ్‌ లు వేరు. ఆ టీమ్‌లు వేరే. అదీ సంగ‌తి.
Tags:    

Similar News