చూడగానే ఎట్రాక్ట్ అయిపోవాలి. అందరూ తమ వస్తువులే కొనాలి.. ఏదైనా ఐటమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కంపెనీల టార్గెట్ ఇదే. ప్రొడక్ట్ సేల్ కోసం యాడ్స్ లో క్రియేటివిటీ అంతా చూపించేస్తుంటాయ్ యాడ్ ఏజెన్సీస్. అయితే ఒక్కోసారి ఆ యాడ్స్ మిస్ ఫైర్ అవుతుంటాయ్. ఏకంగా కంపెనీల పీకకి చుట్టుకోని సారీ చెప్పే దాకా వస్తాయ్. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి కష్టాల్లోనే పడింది ఓ ఇంటర్నేషనల్ క్లోతింగ్ బ్రాండ్ కంపెనీ.
డెన్మార్క్ ఫ్యాషన్ బ్రాండ్ జాక్ అండ్ జోన్స్ ఇండియాలో మార్కెటింగ్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ని అంబాసిడర్ గా పెట్టుకోని కేంపైన్ చేస్తోంది. ఆఫీస్ వేర్ షర్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ రీసెంట్ గా మెట్రో సిటీస్ లో బిల్ బోర్డ్స్ పెట్టింది. ఇప్పుడు అదే జాక్ అండ్ జోన్స్ కొంప ముంచింది. ఈ ప్రకటనలో రణవీర్ ఓ అమ్మాయ్ ని భుజాల మీద వేసుకోని వెళ్లడం.. ఆ అమ్మాయ్ కూడా నవ్వుతూ ఉండటం.. వెనక నుంచి లిఫ్ట్ బాయ్ ఆమెకి కన్నుకొట్టడం.. సమ్ థింగ్ కాదు టోటల్ గా రాంగ్ వేలో ఉంది ఈ యాడ్. రణవీర్ షార్ప్ షర్ట్- స్కిన్నీ జీన్స్ లో అదిరిపోతే మోడల్ మాత్రం బ్లౌజ్ అండ్ మినీ స్కర్ట్ తో సగం బాడీ చూపించేస్తోంది. పైగా డోన్ట్ హోల్డ్ బ్యాక్.. టేక్ యువర్ వర్క్ హోమ్ అంటూ పెట్టిన కేప్షన్ అయితే చూసిన వాళ్లకి చిర్రెత్తెలా చేసింది. అమ్మాయ్ ని చూపించి వర్క్ ని ఇంటికి తీసుకెళ్లండని ఏం చెప్పదల్చుకున్నారంటూ అందరూ కలిసి కంపెనీని ఓ రేంజ్ లో వేసుకున్నారు.
అన్నీ అయిపోయాయ్ ఇప్పుడు కార్పోరేట్ ఉమెన్ ని అవమానిస్తున్నారా అంటూ రఫ్ఫాడించేశారు నెటిజన్లు. హీరో సిద్ధార్థ్ దగ్గర్నుంచి సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ చెడుగుడు ఆడేసుకున్నారు. దీంతో దెబ్బకి దిగొచ్చిన కంపెనీ మేం తీసింది ఒకటి.. మీకు అర్థమైంది మరోకటి. ఎనీ వే సారీ ఆ బిల్ బోర్డ్స్ అండ్ యాడ్స్ తీసేస్తామని క్షమాపణ చెప్పింది. అయినా డబుల్ మీనింగ్ వచ్చేలా యాడ్స్ చేయడం.. తరువాత సారీ చెప్పడం.. ఇదో ఫ్యాషనైపోయింది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/