విధి అంతే. ఎంత సంపద ఉన్నా తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు నడిరోడ్డు మీదకు తెచ్చేస్తాయి. చైనా మెగాస్టార్ జాకీ చాన్ కూతురు దీనికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. తన పేరు ఎట్టా ఎన్. జాకీ చాన్ తో కలిసి సహజీవనం చేసిన ఎక్స్ బ్యూటీ క్వీన్ ఎలైన్ ఎన్ కు పుట్టిన పాపే ఈ ఎట్టా. తను ఇప్పుడు హాంగ్ కొంగ వీధుల్లో బ్రిడ్జ్ ల కింద తల దాచుకుంటూ దొరికింది తింటూ రోజులు వెళ్ళదీస్తోంది. తండ్రి అంత పెద్ద స్టార్ అయితే తనకు ఇంత ఖర్మ ఎందుకు పట్టింది అనుకోకండి. అక్కడికే వద్దాం. ఆ మధ్య నాని అ!! అనే సినిమా ఒకటి తీసాడు గుర్తుంది కదా. అందులో ఈశా రెబ్బ నిత్య మీనన్ ని ప్రేమించి తననే పెళ్లి కూడా చేసుకుంటానని రెస్టారెంట్ లో అమ్మ నాన్నలకు చెబుతుంది. తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ అప్రస్తుతం కాని ఎట్టా కూడా ఇదే బ్యాచ్. ఎట్టా అండీ అనే అమ్మాయిని ప్రేమించింది. 18 ఏళ్ళ లేత వయసులోనే మరో అమ్మాయితో డీప్ లవ్ లో పడింది ఎట్టా.
ఇండియాలోనే కాదు ఎక్కడైనా స్వలింగ సహజీవనానికి ఏ తల్లి తండ్రులు ఒప్పుకోరు. జాకీ చాన్ కూడా అదే చేసాడు. వ్యవహారం తెగతెంపుల దాకా వచ్చేసింది. అంతే. ఎట్టా రోడ్ మీదకు వచ్చేసింది. అండీ తో కలిసి ఉంటూ నానా రకం పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటోంది. తన దీన స్థితిని వివరిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసి ఆన్ లైన్ లో వదిలింది. నెల రోజుల నుంచి చాలా దుర్భరమైన స్థితిని అనుభవిస్తున్నా అని దీనికి కారణం తన తల్లితండ్రులే అని అందులో స్పష్టంగా పేర్కొంది. ఇంకేముంది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్న జాకీ చాన్ కూతురు వీడియో కనక వైరల్ కావడానికి ఎంతో సేపు పట్టలేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదన్న ఎట్టా ముందు ఏం చేయబోతోందో మాత్రం చెప్పలేదు. జాకీ చాన్ ఇదో పెద్ద తలనెప్పిగా మారే అవకాశం ఉంది . తన పరువును నిలువునా మంట గలుపుతున్న ఈ వీడియో గురించి స్పందించకుండా మౌనాన్నే ఆశ్రయించాడు. టైం బాలేకపోతే కొన్ని సంఘటనలు స్టార్ పరువును ఎలా బజారుకీడుస్తాయో ఇంత కన్నా ఉదాహరణ ఇంకేం కావాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View