శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇటీవలి కాలంలో బ్రాండ్ వాల్యూ పెంచుకుంటోంది. సల్మాన్ కిక్ ఇచ్చిన సక్సెస్ ఈ అమ్మడికి పెద్ద అస్సెట్ అయ్యింది. అప్పట్నుంచి కార్పొరెట్ కంపెనీలు వాణిజ్య ప్రకటనల కోసం ఈ అమ్మడి వెంట పడుతున్నాయి. అంతేకాదు జాక్విలిన్ ఇప్పటికిప్పుడు వరుసగా సినిమాలకు కమిటవుతోందంటే భాయ్ చేయూత ఇవ్వడం వల్లే.
కెరీర్ లో పూర్తిగా వెనకబడి ఉన్నప్పుడు సల్మాన్ భాయ్ జాక్విలిన్ కి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఆ ఛాన్స్ నా జీవితాన్నే మార్చేసిందని జాక్విలిన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఓ సూపర్ మోడల్ కం నటిగా ముంబైలో తనకంటూ ఓ స్థానాన్ని కల్పించుకుంది. తాజాగా ఈ అమ్మడు ఓ కాంట్రాక్టుపై సంతకం చేసింది.
తుమి ట్రావెలింగ్ బ్యాగ్స్ కంపెనీకి జాక్విలిన్ బ్రాండ్ అంబాసిడర్. 1975లో ఈ కంపెనీ పుట్టింది. 40ఏళ్లుగా ఈ రంగంలో సేవలందిస్తూనే ఉంది. వేల రకాల ట్రావెల్ బ్యాగ్స్ మోడళ్లను క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న తుమి కంపెనీకి జాకీ ప్రచారం చేసే హోదా దక్కించుకోవడం అరుదైన గౌరవం అని ఇతరులు భావిస్తున్నారు.