ఆ హీరోయిన్ హోట‌ల్ పేరు వింటే షాకే

Update: 2017-12-26 08:31 GMT
దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకోవ‌టం చాలా కొద్దిమందిలోనే క‌నిపిస్తుంది. వెండితెర మీద హీరోయిన్ గా వెలిగిపోతున్న భామ‌.. ఓప‌క్క సినిమాల్లో బిజీబిజీగా ఉంటూ.. మ‌రోవైపు త‌న ఆస‌క్తికి త‌గ్గ‌ట్లుగా హోట‌ళ్ల‌ను స్టార్ట్ చేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. అలాంటి ప‌నిని స‌క్సెస్ ఫుల్ గా చేస్తోంది బాలీవుడ్ అందాల భామ జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్‌.

వ‌రుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా శ్రీ‌లంక‌లో ఒక హోట‌ల్ ను స్టార్ట్ చేసింది. అయితే.. ఈ హోట‌ల్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ పెట్ట‌ని రీతిలో.. పేరు విన్నంత‌నే కిక్ వ‌చ్చేలా పేరును సెలెక్ట్ చేయ‌టం విశేషం.

హోట‌ల్ లో వ‌డ్డించే ఫుడ్ ఎలా ఉంటుందో కానీ.. పేరు విన్నంత‌నే మ‌న‌సుకు కొత్త హుషారు వ‌చ్చేలా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. న‌టీమ‌ణులు వ్యాపారాలు చేయ‌టం మామూలే అయినా.. కేవ‌లం పేరుతోనే పాపుల‌ర్ అయిపోవ‌టం మాత్రం జాక్వెలిన్ ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి. ఇంత‌కీ ఆమె స్టార్ట్ చేసిన హోట‌ల్ పేరును చెప్ప‌లేదు క‌దూ.

కామ‌సూత్ర పేరుతో ఆమె త‌న హోట‌ల్ ను ప్రారంభిస్తున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.  హోట‌ల్‌కు ఇలాంటి పేరును ఎంపిక చేసుకోవ‌టం విశేషంగా చెబుతున్నారు. హోట‌ల్లో వ‌డ్డించే ఫుడ్ కంటే.. పేరుతోనే స‌రికొత్త ఇమేజ్ తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో జాక్వెలిన్ ఈ పేరును ఎంపిక చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. కామ‌సూత్ర పేరుతో పాటు.. దాని వెనుక జాక్వెలిన్  పేరు యాడ్ అయిన నేప‌థ్యంలో ఆమె హోట‌ల్ పాపుల‌ర్ కావ‌టం పెద్ద క‌ష్టం కాదంటున్నారు.ఏమైనా.. అమ్మ‌డు పెట్టిన పేరు ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News