శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ రకరకాల వివాదాలతో మీడియాలో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకేష్ చంద్రశేఖరన్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాకీని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. జాక్విలిన్ తో సుకేష్ రొమాన్స్ ముద్దు సన్నివేశాల ఫోటోలు అంతర్జాలంలో హీటెక్కించాయి. నాటి నుంచి జాకీని ఈడీ విచారిస్తూనే ఉంది. అలాగే నగరం విడిచి బయటకు వెళ్లేందుకు వీల్లేదని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
భారతదేశం నుండి విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో ED అధికారులు అడ్డుకున్న ఘటన తెలిసిందే. ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన ఈ శ్రీలంకన్ బ్యూటీ.. వాస్తవానికి ముంబైలో నివసిస్తుంది . ఇన్నాళ్టికి ఆరుబయట ప్రత్యక్షమైంది. తాజా చిత్రం ఎటాక్ ప్రమోషన్స్ లో హీరో జాన్ అబ్రహం తో కలిసి ప్రచారానికి దిగింది జాకీ. కొన్ని వీడియో ఇంటర్వ్యూల్లో కనిపించింది. ఎట్టకేలకు సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నందున చాలా కాలం తర్వాత ఆమెను చూడటం కోసం ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.
ఇటీవల జాకీ ఎన్ ఫోర్మ్‌సెన్ డైరెక్టరేట్ కార్యాలయాలకు రెండుసార్లు వెళ్లింది. అక్కడ ఎనిమిది గంటలకు పైగా విచారణ కొనసాగింది. అన్నిటికీ జాక్విలిన్ సహకరించింది. సుకేష్ కి సంబందించిన లోగుట్టును జాకీ బయటపెట్టింది. కారణం ఏదైనా కానీ జాక్వెలిన్ వివాదం తనకు అన్నిరకాలా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా కెరీర్ లో క్రేజీ అవకాశాలు చేజారుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. తన తెలుగు చిత్రం హర హర వీరమల్లు నుంచి జాకీ వైదొలగిందని టాక్ వచ్చింది. పవర్ స్టార్ తో కలిసి నటించే అరుదైన అవకాశాన్ని కోల్పోయింది.
SCAM 200కోట్లు.. జాకీకి BMW మమ్మీకి పోర్ఛ్ కానుకలు!
సుకేష్ .. ది గ్రేట్ కాన్ మేన్.. 200 కోట్ల మనీలాండరింగ్ లో జాకీతో పాటు జాక్విలిన్ ఫ్యామిలీ బుక్కయిన సంగతి తెలిసిందే. తవ్వే కొద్దీ ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి ఈ కేసులో. కేవలం ఒక్క జాక్విలిన్ ఫ్యామిలీకి సుకేష్ నుంచి 10 కోట్ల మేర తాయిలాలు అందాయని విశ్లేషించింది ఈడీ. ఈ నిజాలన్నిటినీ విచారణలో జాక్విలిన్ అంగీకరించింది. ఒక్క జాక్విలిన్ ఫెర్నాండెజ్ కి అతడి నుంచి 7కోట్ల విలువ చేసే కానుకలు అందాయట. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ -ఆమె కుటుంబ సభ్యులు బిఎమ్‌డబ్ల్యూ- పోర్షే కార్లను అందుకున్నారు. ఖరీదైన ఆభరణాలను కాన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ నుండి అందుకున్నారని ED ఛార్జిషీట్ లో పేర్కొంది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆమె కుటుంబ సభ్యులు బిఎమ్ డబ్ల్యూ- పోర్షే కార్లతో పాటు ఖరీదైన ఆభరణాలను కాన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ నుండి అందుకున్నారని ED ఛార్జిషీట్ లో పేర్కొంది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కాన్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్ ను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్ లో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని పరిచయం చేసుకునేందుకు తనను తాను శేఖర్ రత్న వేలగా పరిచయం చేసుకున్నాడని పేర్కొంది. డిసెంబర్ 2020లో ఆమెతో టచ్ లో ఉండటానికి అతను చేసిన మొదటి ప్రయత్నంలో అతను విఫలమైన తర్వాత.. జనవరి 2021లో ఆమె మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్ ద్వారా అతను జాకీని సంప్రదించినట్లు ఏజెన్సీ వెల్లడించింది. షాన్ కి తాను ప్రభుత్వ అధికారిని అని చెప్పుకునే వ్యక్తి నుండి కాల్ వచ్చిందట. `చాలా ముఖ్యమైన వ్యక్తి` అయిన శేఖర్ రత్న వేలు జాకీని తప్పనిసరిగా సంప్రదించాలని కోరాడట. ఏజెన్సీకి వెల్లడించిన వివరాలలో జాకీ తనకు రెండు జతల డైమండ్ చెవిపోగులు.. రెండు హెర్మేస్ బ్రాస్ లెట్ లు.. మూడు బిర్కిన్ బ్యాగ్ లు.. గూచీ దుస్తులు,.. బహుళ వర్ణ రాళ్ల బ్రాస్ లెట్ .. ఒక జత లూయిస్ విట్టన్ షూస్ వంటి బహుమతులు అందుకున్నట్లు పేర్కొంది. మరోవైపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు 15 జతల చెవిపోగులు.. ఐదు బిర్కిన్ బ్యాగులు..ఇతర విలాసవంతమైన వస్తువులను ఇచ్చినట్లు చంద్రశేఖర్ తన ప్రకటనలో ఓపెన్ గా వెల్లడించాడు.
తాను నటి కార్టియర్ కి బ్యాంగిల్స్ - ఉంగరాలు - రోలెక్స్ వాచీలతో పాటు టిఫనీ & కో ఒక బ్రాస్ లెట్ ను బహుమతిగా ఇచ్చానని చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నటుడికి కేవలం రూ. 7 కోట్ల విలువైన బహుమతులను ఆభరణాల రూపంలో ఇచ్చానని ఆమెకు `ఎస్పూలా` అనే గుర్రాన్ని బహుమతిగా ఇచ్చానని చెప్పాడు. అతను ఆమెకు ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడని జాక్వెలిన్ చెప్పినట్లు తెలిసింది. చంద్రశేఖర్ దాతృత్వం ఆమె కుటుంబానికి కూడా విస్తరించింది. అతను US-లో ఉంటున్న జాక్విలిన్ సోదరుడికి USD 1.5లక్షల రుణం ఇచ్చాడు. జాక్విలిన్ కు BMW X5ని కూడా ఇచ్చాడు. అయితే ఆ కార్ ని జాకీ తిరిగి అతడికి ఇచ్చేసిందట. జాక్విలిన్ తల్లిదండ్రులకు మసెరటి -పోర్స్చే కారును కూడా బహుమతిగా ఇచ్చాడు.
సుకేష్ చంద్రశేఖర్ తనను తాను సన్ టీవీ యజమానిగా .. ప్రముఖ రాజకీయ కుటుంబ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడట. ఆ రకంగా జాక్విలిన్ ని ఆమె కుటుంబాన్ని బోల్తా కొట్టించాడు. అంతేకాదు.. అతను అనేక సినిమా ప్రాజెక్ట్‌లకు సంతకం చేయాలని కోరాడు. అవకాశాలు కల్పిస్తానని జాకీకి నమ్మబలికాడు. అంతేకాకుండా తాను షోరూమ్ లను నిరంతరం సందర్శించేవారిమని అక్కడ నుండి తనకు కావాల్సిన వస్తువుల జాబితాను చంద్రశేఖర్ కి పంపగా.. అతడు కార్డ్ పేమెంట్లు చేసేవాడని ఛార్జ్ షీట్ లో వెల్లడించారు.వాటిని సుకేష్ వ్యక్తిగతంగా లేదా అతని సహాయకుల ద్వారా ఆమెకు డెలివరీ చేసేవాడని జాకీ తెలిపింది.