బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను మనీ లాండరింగ్, దోపిడీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారణకు పిలిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే జాక్వెలిన్ ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలతో ఎక్కువగా హైలెట్ అవుతోంది.
అయితే ఇది వరకే ఈ బ్యూటీ తనపై వస్తున్న ఆరోపణలపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక ఆమె వివరణ ఇచ్చిన కొన్ని రోజులకే మరోసారి ఈడీ నుంచి నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది.
కన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25న శనివారం నాడు ఫైనాన్షియల్ ప్రోబ్ ఏజెన్సీ ఢిల్లీ యూనిట్ ముందు హాజరు కావాలని అధికారులు నటిని కోరారు. అందుకు జాక్వెలిన్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఆమె తనపై వస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తోంది.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు సంబంధించిన విచారణకు జాక్వెలిన్ ను అధికారులు పిలిచారు. అయితే ఈ మనీలాండరింగ్ స్కాంలో జాక్వెలిన్ సూత్రధారిగా హాజరు కాలేదట.. కేవలం ఒక సాక్షిగా బాధితురాలిగా హాజరైందని సమాచారం. ఆ ముఠా చేతిలో మోసపోయిన వారిలో జాక్వెలిన్ కూడా ఒకరని వార్తలు వస్తున్నాయి.
ఈ 200 కోట్ల స్కాంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి సూత్రధారి అని తేలింది. జాక్వెలిన్ తో అతడి గర్ల్ ఫ్రెండ్ పరిచయాన్ని పెంచుకొని ఈమెను స్కాంలోకి లాగారని తెలుస్తోంది. వారి మాయలో పడి జాక్వెలిన్ మోసపోయారని తెలిసింది.
జాక్వెలిన్ వద్ద డబ్బులు తీసుకున్నారా? లేక ఆమె ఇమేజ్ ను వాడుకొని మోసం చేశారా? అన్నది మాత్రం అధికారులు బయటపడడం లేదు. ప్రస్తుతానికి సాక్షిగా, బాధితురాలిగా మాత్రమే విచారణకు జాక్వలిన్ హాజరైందని చెబుతున్నారు. ఈ స్కాంకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
2017ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన లంచం కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్ నుంచి చాలా మంది సెలబ్రెటీల పేర్లు వివిధ అంశాల నుంచి బయటకు వచ్చాయి. ఇక అలాంటి స్టార్ సెలబ్రెటీలలో జాక్వెలిన్ పేరు కూడా బయటకు వచ్చింది. తీహార్ జైలు లోపల నుంచే దాదాపు 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడుపుతున్నట్టు సదురు వ్యక్తిపై ఆరోపణలున్నాయి. తీహార్ జైలు నుంచే కాలేకర్ ఐడి స్ఫూఫింగ్ ద్వారా చంద్రశేఖర్ జాక్వెలిన్ ను సంప్రదించాడని ఆరోపణలు వచ్చాయి.