కిక్ బాక్సింగ్ .. మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన నిపుణులు మాత్రమే ఇలాంటి విన్యాసాలు చేయగలరు. ఒళ్లు గగుర్పొడిచే అసాధారణ ఫీట్స్ తో మైమరిపిస్తోంది శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఈ అమ్మడి విన్యాసాలు ప్రస్తుతం నెటిజనుల్లో హాట్ టాపిక్. ప్రత్యర్థులపై పిడిగుద్దులు కురిపిస్తూ జాక్విలిన్ అద్భుతమైన పంచ్ లైనప్ తో అచ్చం యాక్షన్ క్వీన్ ని తలపిస్తోంది.
జాకీ విసురుతున్న పంచ్ లకు డేనియల్ లొసిసెరో.. ఆరామిస్ మెర్లిన్ లాంటి యాక్షన్ డైరెక్టర్స్ సైతం గిజగిజలాడారు. జాకీ ఓ రియల్ స్టంట్ మన్ ని తలపిస్తూ ఆ ఇద్దరినీ మట్టి కరిపిస్తున్న తీరు ఎంతో ఉత్కంఠ రేపుతోంది. జాకీ స్పీడ్ చూస్తుంటే `టోంబ్ రైడర్` యాంజెలినా జోలీ గుర్తుకు రావాల్సిందే. సాల్ట్ సినిమాలో యాంజెలినా కళ్లు చెదిరే విన్యాసాల్ని జాక్విలిన్ సైతం పెర్ఫామ్ చేయగలదా? అన్నంతగా ఆ యాక్షన్ ప్రాక్టీస్ సీన్స్ లో ఇమిడిపోయి కనిపిస్తోంది.
ది ఫస్ట్ క్లబ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో ఆన్ లైన్ లోకి వచ్చిన కేవలం మూడు గంటల్లోనే 1.7 లక్షల మంది వీక్షించారు. ఇప్పటికీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అసలు ఈ లేడీ ఫైటర్ ఎవరు? అంటూ ఒకటే సామాజిక మాధ్యమాల్లో డిబేట్ కి తావిచ్చింది ఈ వీడియో. ఇలాంటి రియల్ లైవ్ స్టంట్స్ ఎంతో కఠోర సాధనతో మాత్రమే సాధ్యం. ఇటీవల బాలీవుడ్ నాయికలు కత్రిన- దిశా పటానీ- తాప్సీ సహా పలువురు నాయికలు మార్షల్ క్వీన్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో జాకీ పేరును చేర్చాలన్నమాట.