గ్లామర్ బోర్ కొట్టింది.. విలనీ చేస్తా!

Update: 2016-08-20 08:20 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ చిత్రం "బేవాచ్‌"లో నెగటివ్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇదే స్పూర్తితో ఈమధ్యకాలంలో శ్రద్ధాకపూర్ కూడా విలన్ పాత్రల్లో చేయాలని ఉందంటూ ప్రకటించింది. అయితే వీరిద్ధరినీ స్పూర్తిగా తీసుకుందో లేక తానుకూడా రొటీన్ కి భిన్నంగా కనిపించాలని తపన పడుతుందో తెలియదు కానీ... తన కొత్త కోరిక బయటపెట్టింది జాక్వెలిన్.

సాదారణంగా హీరోయిన్స్ అనేవారంతా... గ్లామర్ పాత్రలకు - ఫెర్మార్మెన్స్ స్కోప్ ఉన్న పాజిటివ్ పాత్రలకే ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే ఇప్పటి హీరోయిన్లు మాత్రం విలన్ పాత్రల్లో కూడా నటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్ లో చేరడానికే శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆసక్తిని చూపిస్తుంది. ఈ ఏడాది "హౌస్‌ఫుల్‌-3" - "డిషూం" చిత్రాలతో విజయాలను అందుకుని మాంఛి ఊపుమీదున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. త్వరలో సూపర్‌ హీరో చిత్రం "ఫ్లైయింగ్‌ జాట్‌"తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్న  జాక్వెలిన్ తన మనసులోని కోరికను కూడా బయటపెట్టేసింది.

ఈ ఏడాది అన్నీ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు - గ్లామర్‌ పాత్రలూ మాత్రమే వచ్చాయని, అయితే ఈసారి మాత్రం పూర్తి భిన్నమైన పాత్రల్లో నటించాలని ఉందని జాక్వలిన్ చెబుతుంది. ఇదే సమయంలో విలన్‌ పాత్రల్లో నటించాలని కూడా ఆశగా ఉందని.. అలాంటి పాత్రలు తనలోని నటిని బయటపెట్టడానికి తోడ్పడతాయని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా.. జాక్వెలిన్ కోరిన కోరికని బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎంతవరకూ పరిగణలోకీ తీసుకుంటారో, ఆమె ఆశను ఎవరు నెరవేరుస్తారో చూడాలి!
Tags:    

Similar News