చిత్రం :‘జగమే తంత్రం’
నటీనటులు: ధనుష్-ఐశ్వర్యా లక్ష్మి-జోజు జార్జ్-జేమ్స్ కాస్మో-కలైఅరసన్-వడివుక్కరసు తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: శ్రేయస్ కృష్ణ
నిర్మాత: శశికాంత్
రచన-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
కరోనా టైంలో సౌత్ ఇండియాలో ‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత నేరుగా ఓటీటీకి విడుదలైన భారీ చిత్రం ‘జగమే తంత్రం’. ధనుష్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన సినిమా ఇది. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జగమే తంత్రం’ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సురుళి (ధనుష్) తమిళనాడులోని మధురై ప్రాంతంలో ఒక రౌడీ. ఇక్కడ హత్యలు.. సెటిల్మెంట్లు చేసుకుంటూ బతుకుతున్న అతను.. ఒక హత్య చేసిన అనంతరం నెల రోజుల పాటు ఊరు విడిచి వెళ్లాల్సిన అవసరం పడుతుంది. అదే సమయంలో లండన్లో పీటర్ (జేమ్స్ కాస్మో) అనే మాఫియా డాన్ కింద పని చేయాల్సిన కాంట్రాక్టు సురుళికి వస్తుంది. ఆ డాన్ కు బద్ధ శత్రువు అయిన శివదాస్ (జోజు జార్జ్) అక్రమ వ్యాపారాల గుట్టు కనిపెట్టి అతడి పతనానికి కారణమవుతాడు సురుళి. కానీ దాని వల్లే సురుళి ఊహించని ప్రమాదంలో పడతాడు. తాను చేసింది పెద్ద తప్పని తెలుసుకుంటాడు.. ఆ స్థితిలో సురుళి ఏం చేశాడన్నది మిగతా కథ.
కథనం-
విశ్లేషణ: కథ వేరే దేశంలో నడుస్తుంది. హీరో అక్కడ శరణార్థులుగా.. ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్న వారి కోసం పోరాడతాడు. అక్కడుండే పెద్ద గ్యాంగ్ స్టర్ కు వాళ్ల పొడే గిచ్చదు. వలస కార్మికులందరినీ దేశం నుంచి తరిమేయాలని చూస్తాడు. హీరో అతడిని ఢీకొడతాడు. ఇదంతా చదువుతుంటే.. ఆటోమేటిగ్గా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కబాలి’ గుర్తుకొచ్చేస్తోంది కదా? అప్పట్లో టీజర్ తో భారీగా అంచనాలు పెంచి.. తీరా థియేటర్లలోకి వెళ్లాక ‘కబాలి’ ఎంతగా నిరాశకు గురి చేసిందో తెలిసిందే. కథ బాగానే అనిపించినా.. దాని కథనం మాత్రం విసుగెత్తించింది. ఇప్పుడు రజినీ అల్లుడు ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘జగమే తంత్రం’ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. ట్రైలర్ చూసినపుడే ఇందులో ‘కబాలి’ ఛాయాలు కనిపించగా.. ఇక ఇప్పుడు సినిమా చూస్తున్నంతసేపూ కూడా ‘కబాలి’ని గుర్తుకు తెస్తూ నీరసానికి గురి చేసేస్తుంది ‘జగమే తంత్రం’. కనీసం రజినీ సినిమాలో కథ ఒక తీరుగా అయినా వెళ్తుంది. అందులో ఒక ఎమోషన్ అయినా ఉంటుంది. కానీ ధనుష్ మూవీలో అవి కూడా మిస్సయ్యాయి. సింపుల్ గా చెప్పాలంటే పేరు గొప్ప ఊరు దిబ్బ టైపు సినిమా ‘జగమే తంత్రం’.
పిజ్జా.. జిగర్ తండ చిత్రాలతో వావ్ అనిపించి.. ఆ తర్వాత సినిమా సినిమాకూ తన స్థాయిని తగ్గించుకుంటూ వస్తున్న కార్తీక్ సుబ్బరాజ్.. తన కెరీర్లోనే అత్యంత వీకెస్ట్ మూవీని అందించాడు ‘జగమే తంత్రం’ రూపంలో. 2 గంటల 40 నిమిషాల నిడివిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సన్నివేశం ఒక్కటంటే ఒక్కటీ కనిపించదు. ఈ కథను కార్తీక్ నరేట్ చేసిన తీరే సినిమాకు పెద్ద మైనస్ అయింది. ఎంచుకున్నదేమో అంతర్జాతీయ సమస్యతో ముడిపడ్డ ఎమోషనల్ స్టోరీ. కానీ ప్రేక్షకులను కదిలించే ఎమోషన్ తీసుకొచ్చే సన్నివేశాలు ఇందులో పడలేదు. మధ్యలో శ్రీలంక తమిళుల సమస్యను పైపైన కొంచెం టచ్ చేసి వదిలేసి.. హీరోయిన్ తో ఎమోషనల్ డైలాగులు చెప్పించి కాస్త కదిలించే ప్రయత్నం జరిగింది కానీ.. దానికి ముందు తర్వాత అంతా కథనం ప్రేక్షకుల్లో నీరసం తీసుకొస్తుంది. కనీసం హీరోకు అయినా సరైన ఎలివేషన్ ఇచ్చారా అంటే అదీ లేదు. ధనుష్ తన పెర్ఫామెన్స్ తో కొన్ని సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం చేశాడు తప్పితే.. ఆ పాత్ర కానీ.. దాంతో ముడిపడ్డ సన్నివేశాలు కానీ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా లేవు.
‘జగమే తంత్రం’ ఆరంభంలో ఇచ్చే బిల్డప్ చూస్తే మామూలుగా ఉండదు. లండన్ నేపథ్యం.. అక్కడ వలస కార్మికుల కష్టాలు.. ఈ క్రమంలో మొదలయ్యే కథను చూస్తే కార్తీక్ సుబ్బరాజ్ ఏదో గొప్ప సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తుంది. కానీ కాసేపటికే ఆ ఆశలు ఆవిరైపోతాయి. హీరో పాత్రను మొదలుపెట్టిన తీరే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎక్కడో మధురైలో రౌడీయిజం చేసుకుంటున్న హీరోను.. లండన్లో ఉండే పెద్ద అంతర్జాతీయ డాన్ తన ప్రత్యర్థిని ఏమీ చేయలేక కాంట్రాక్ట్ కింద తెచ్చుకోవడం.. అతడి ద్వారా ప్రత్యర్థి వ్యాపార సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడం లాజికల్ గా అనిపించదు. 20 ఏళ్లుగా తన ప్రత్యర్థి ఏం చేస్తున్నాడో కూడా విలన్ తెలుసుకోలేకపోతే.. ఇంగ్లిష్ సరిగా రాని.. తొలిసారి లండన్లో అడుగుపెట్టిన వ్యక్తి అతడి గుట్టునంతా కనిపెట్టేసినట్లు చూపించడం సిల్లీగా అనిపించక ఎలా ఉంటుంది? పూరి జగన్నాథ్ సినిమా ‘బుజ్జిగాడు’లో హీరో పాత్ర నుంచి స్ఫూర్తి పొందాడో ఏమో కానీ.. కార్తీక్ కొంతమేర దాన్ని పోలినట్లుగా ధనుష్ పాత్రను ప్రెజెంట్ చేశాడు. ఒక ఎపిసోడ్ కూడా నడిపించాడు. కానీ ‘బుజ్జిగాడు’లో మాదిరి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కు స్కోప్ లేకపోయింది. హీరో తన జిత్తులమారి తనంతో విలన్ తో చేతులు కలిపి శివదాస్ ను మట్టు పెట్టే ఒక్క సీన్ ప్రేక్షకులను కొంత ఎగ్జైట్ చేస్తుంది.
కానీ శివదాస్ పాత్రను మధ్యలో ముగించేయడం సినిమాకు పెద్ద మైనస్ అయింది. అక్కడి నుంచి కథ పెద్దగా ముందుకు కదలదు. ఆసక్తి మరింత సన్నగిల్లిపోతుంది. ప్రథమార్ధం వరకు కాస్తో కూస్తో అయినా ‘జగమే తంత్రం’ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం సహనానికి పరీక్ష పెడుతుంది. హీరోయిన్ పాత్ర ఫ్లాష్ బ్యాక్.. ఆ తర్వాత హీరోలో పరివర్తన వచ్చే సన్నివేశాల్లో కొత్తదనం ఏమీ లేదు. రాను రానూ ప్రేక్షకులు పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయి.. సినిమా ఎప్పుడు ముగుస్తుందా అన్నట్లుగా నడుస్తుంది ‘జగమే తంత్రం’. పతాక సన్నివేశాలను మాస్ మెచ్చేలా ప్రెజెంట్ చేయాలని కార్తీక్ చూశాడు కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక కాజ్ నేపథ్యంలో ఉన్నతమైన కథను ఎంచుకున్న కార్తీక్.. అందుకు తగ్గట్లుగా సిన్సియర్ గానూ సినిమా తీయలేకపోయాడు. అలాగని దీన్నొక కమర్షియల్ ఎంటర్టైనర్ లాగానూ మలచలేకపోయాడు. రెంటికీ చెడ్డట్లు తయారైన ‘జగమే తంత్రం’ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేయడం ఖాయం.
నటీనటులు:
ధనుష్ నటనకు వంక పెట్టడానికేమీ లేదు. సురుళి పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడు. చాలా వరకు వినోదాత్మకంగా సాగే పాత్రలో అతను హుషారుగా నటించాడు. హీరో ఎలివేషన్ సీన్లలో అదరగొట్టాడు. ద్వితీయార్ధంలో ఎమోషన్ సీన్లు కూడా బాగానే చేశాడు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ లాగా కాకుండా ఒక పాత్రధారిలా కనిపిస్తుంది. ఆమె ధనుష్ కు దీటుగా నటించి మెప్పించింది. తన పాత్ర తాలూకు రహస్యాన్ని బయటపెట్టే దగ్గర్నుంచి ఐశ్వర్య తన ప్రత్యేకతను చాటుకుంటుంది. మలయాళ నటుడు జోజు జోసెఫ్.. కీలకమైన శివదాస్ పాత్రలో రాణించాడు. కాకపోతే ఆ పాత్రను మధ్యలో ముగించేయడం నిరాశ పరుస్తుంది. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘జగమే తంత్రం’ టాప్ క్లాస్. సంతోష్ నారాయణన్ పాటలు తమిళ వాసనల వల్ల అంతగా రుచించవు కానీ.. నేపథ్య సంగీతం చాలా స్టైలిష్ గా.. ఇంటెన్స్ గా ఉండి ఆద్యంతం అలరిస్తుంది. శ్రేయస్ కృష్ణ ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. విజువల్స్ చాలా చోట్ల వావ్ అనిపిస్తాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సుబ్బరాజ్ విషయానికి వస్తే.. అతను కొంచెం భిన్నమైన.. భారీతనం ఉన్న కథనే ఎంచుకున్నాడు. ఐతే ఈ కథకు ఎంతమాత్రం న్యాయం చేసేలా కథనం తీర్చిదిద్దుకోలేదు. పిజ్జా.. జిగర్ తండ లాంటి సినిమాల్లో మాదిరి స్క్రీన్ ప్లేలో అతడి మార్కు మెరుపుల్లేవు. కార్తీక్ నరేషన్ మరీ నెమ్మదిగా ఉండటం ‘జగమే తంత్రం’కు పెద్ద సమస్యగా మారింది.
చివరగా: జగమే తంత్రం.. మరో కబాలి
రేటింగ్-2/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Ott