ఏ ముహూర్తాన ‘లెజెండ్’ సినిమాలో నటించాడో కానీ.. అక్కడి నుంచి జగపతి బాబు దశ తిరిగిపోయింది. స్టైలిష్ విలన్ అవతారాల్లో, క్యారెక్టర్ రోల్స్ లో చెలరేగిపోతున్నాడీ సీనియర్ నటుడు. మధ్యలో ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడిన జగపతి.. ఇప్పుడు తనదైన శైలిలో జీవితాన్ని లీడ్ చేస్తూ విలాసం అంటే ఏంటో చూపిస్తున్నాడు. ట్విట్టర్లో ఆయన్ని ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది జగపతికి ఎంత తిక్క ఉందని.
హార్లీ డేవిడ్సన్ బైకులు నడుపుతూ.. లగ్జీరియస్ బీఎండబ్ల్యూ కార్ల ముందు కూర్చుని స్టైలిష్ అవతారాల్లో ఆయన చేస్తున్న ఫొటో షూట్లు తన అభిమానులకు పిచ్చెక్కించేస్తున్నాయి. ఈ తరం యంగ్ హీరోలకు కూడా కన్ను కుట్టేంత స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు జగపతి ఈ ఫొటో షూట్లలో. తాజాగా జగపతి ఫొటో షూట్ చూస్తే మతిపోవడం ఖాయం.
‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ - జగపతి స్టయిల్ విషయంలో పోటాపోటీగా తయారైన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా విష్ చేస్తూ ఎన్టీఆర్ ఓ స్టైలిష్ అవతారంలో కనిపించాడు గుర్తుందా? అచ్చంగా అలాగే తయారైన ఓ ఫొటోను ఈ రోజు ట్విట్టర్లో షేర్ చేశాడు జగపతి. ఎన్టీఆర్ కు ఏమాత్రం తీసిపోనంత స్టయిల్ గా ఉన్నాడు సీనియర్ హీరో. ‘నాన్నకు ప్రేమతో’లో స్టైలిష్ బ్యాడ్ మ్యాన్ గా తన అవతారం ఇదీ అని ట్వీట్ చేశాడు జగపతి.