దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నింటికీ చాలా పెద్ద పెద్ద యాక్టర్ లను తీసుకున్నారు. బాహుబలి సినిమాలో దాదాపు పది క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. ఆ సినిమా విడుదల అయ్యాక ఆ నటులందరికీ ఒకరిని మించి మరొకరికి పేరొచ్చింది. నిజం చెప్పాలంటే 'బాహుబలి' సినిమా పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది కట్టప్ప - శివగామి పాత్రలే. అంతలా రాజమౌళి ఆ పాత్రలను తీర్చిదిద్దాడు.
రెండు రోజుల క్రితం విడుదలైన సైరా మూవీలో కూడా ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ - తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి - కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ - జగపతి బాబు - నయనతార - తమన్నా లాంటి హేమాహేమీలు ఉన్నారు. కానీ దర్శకుడు సురేంద్రరెడ్డి చిరంజీవిని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించి మిగిలిన నటుల గురించి మర్చిపోయాడు. వాళ్లంతా వాళ్ళ వాళ్ళ భాషల్లో చాలా పెద్ద నటులు. ఈ యాక్టర్స్ అందరూ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఈ సినిమాలో నటించారు. కానీ సురేంద్రరెడ్డి కేవలం చిరంజీవి మీదే ఫోకస్ పెట్టి మిగిలిన క్యారెక్టర్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు
ఈ సినిమా థాంక్స్ మీట్ లో జగపతి బాబు మాట్లాడుతూ... ఈ సినిమాలో రాంచరణ్ చాలా ఖరీదైన జూనియర్ ఆర్టిస్ట్ లని పెట్టాడని తనతో ఒక వ్యక్తి అన్నాడని - తాను కూడా నిజమే అనుకున్నా అని - కానీ సినిమా విడుదల అయ్యాక తన పాత్రతో పాటు చాలామంది పాత్రలకి మంచి పేరు వచ్చిందని అన్నారు. కానీ సినిమా చూసిన జనం మాత్రం చిరంజీవి గురించి తప్ప మిగిలిన క్యారెక్టర్స్ గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు. ఉన్నంతలో చిరంజీవి కాకుండా తమన్నా, జగపతి బాబు - సుదీప్ క్యారెక్టర్స్ కొంచెం బెటర్. అమితాబ్ బచ్చన్ - విజయ్ సేతుపతి - నయనతార లాంటి వాళ్ళ క్యారెక్టర్స్ సినిమా చూసి బయటకి వచ్చిన కొన్ని గంటల్లోనే మర్చిపోతాం.