వీరమల్లు ముగింపు..200 మందిపై భారీ సీన్స్!
ఇటీవలే హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పిరియాడిక్ చిత్రం `హరిహర వీరమల్లు` తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. `స్వార్డ్ వర్సెస్` స్పిరిట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. భారీ కాన్సాస్ పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకుంది. కొన్ని నెలలుగా తాడేపల్లికి సమీపంలో ప్రత్యేకమైన సెట్లు వేసి చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మందిపై ఈ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసారు. సినిమాలో ఈ వార్ సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ని నిర్మాతలు అందించారు. `సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరిస్తాం.
ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులు పాల్గొంటారు. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ మొత్తం పూర్తి అవుతుంది` అని తెలిపారు. ` యానిమల్` ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ఫస్ట్ క్లాస్ టెక్నిషీయన్లు పనిచేస్తున్నారు.
కీరవాణి సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు తీసుకున్నారు. లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ పనిచేస్తున్నారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి భాగం రిలీజ్ ని 2025 మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.