జగపతి 'వైల్డ్' సైడ్ అంటే వైల్డుకుమించి!!

Update: 2016-10-12 04:19 GMT
మామూలుగా చాలామంది నాకు వైల్డ్ సైడ్ ఉంది తెలుసా? అంటుంటారు. చాలాసార్లు ఈ వైల్డ్ సైడ్ అంటే ఏంటంటే.. తాగి చిందులేయడమే. అయితే అలా చేయడంలో కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయ్. కాని మన హీరో కమ్ విలన్ జగపతి బాబు ఉన్నాడు చూడండి.. ఆయన తాగి చిందులేశాడా తాగకుండా చిందులేశాడా అనే విషయం చెప్పలేదు కాని.. చిందులు మాత్రం వేశాడట. అవి ఓ రేంజులో ఉండేవట.

మనోడు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కు సి.ఎం.గా ఉన్నప్పుడు.. ఏకంగా హైదరాబాదులోని ఆయన అఫీస్ ముందే నడిరాత్రి డ్యాన్సులు వేసిన రోజులున్నాయట. అయితే అక్కడుండే పోలీసు సెక్యూరిటీ జగపతిని మర్యాద పూర్వకంగా వెళ్ళిపోమన్నారు కాని.. ఇంకా ఏమీ అనలేదట. అలాగే లాస్ వెగాస్ నగరంలో కూడా ఒక ప్రముఖ ఖరీదైన లగ్జరీ హోటల్ నుండి కూడా జగపతిని గెంటేశారట. మొత్తం వీళ్ళ గ్యాంగ్ అందరినీ బయటకు పంపేశారట. వీరు వేస్తున్న చిందులు.. లాస్ ఏంజెలిస్ లోనే ఓవర్ అన్నారంటే.. అసలు వారి చిందులు ఏ రేంజులో ఉన్నాయో ఊహించండి.

నాన్నకుప్రేమతో.. శ్రీమంతుడు.. వంటి సినిమాల్లో తన ప్రత్యేకమైన పాత్రలతో అలరించిన జగపతి బాబు.. ఇప్పుడు పూరి జగన్ తీసిన ''ఇజం'' సినిమాలో ఒక రిచ్ డాన్ పాత్రలో రెచ్చిపోతున్నాడు. అక్టోబర్ 21న ఆ వైల్డ్.. కాదు కాదు.. వైల్డుకుమించిన ఫీట్ మనం చూడొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News