జైభీమ్ వివాదం : బుద్ధి ఉందా.. నీవు సినిమా వాడివేనా?

Update: 2021-11-17 15:05 GMT
సూర్య హీరోగా నటించిన జైభీమ్ సినిమా మొదట విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.. అవార్డులు రివార్డులు ఎన్ని ఇచ్చినా తక్కువే అంటూ సినీ అభిమానులు కామెంట్స్ చేశారు. జై భీమ్‌ సినిమా ఓటీటీ లో ఓ రేంజ్ లో స్ట్రీమింగ్‌ వ్యూస్ మరియు రన్ టైమ్‌ ను దక్కించుకుంటున్న సమయంలో అనూహ్యంగా వివాదం మొదలు అయ్యింది. ఒక వర్గం వారు తమ సామాజిక వర్గంను కించ పర్చే విధంగా ఈ సినిమాను తీశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఒకరికి అన్యాయం జరిగింది అని చూపించే క్రమంలో ఆ అన్యాయంను తమ సామాజిక వర్గం వారు చేశారు అని చూపించేందుకు ప్రయత్నించినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. జై భీమ్‌ పై ఇప్పటికే ఆ సామాజిక వర్గం వారు 5 కోట్ల పరువు నష్టం దావాను కోర్టు లో వేయడం జరిగింది. ఈ పరువు నష్టం దావా విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు సదరు సామాజిక వర్గం వారి మద్య చిన్నపాటి యుద్ద వాతావరణం నెలకొంది.

పీఎంకే పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సూర్యకు వ్యతిరేకంగా.. జై భీమ్‌ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య అభిమానులు మరియు ఈ సినిమాను అభిమానించిన వారు అంతా కూడా వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో సూర్యకు సపోర్ట్ గా హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్‌ చేస్తుంటే మరో వైపు వ్యతిరేకంగా కూడా కొందరు హ్యాష్‌ ట్యాగ్స్ ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ వారి మద్దతు సూర్యకు లభిస్తుంది. చాలా మంది సినీ ప్రముఖులు సూర్యకు మద్దతు తెలిపి ఒక మంచి సినిమాను తీశారు.. ఇలాంటి విమర్శలు పట్టించుకోవద్దు.. మా సపోర్ట్ నీకు ఉంది అంటూ ట్వీట్స్ చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా వారి మద్దతును తెలియజేస్తున్నారు. ఈ సమయంలో తమిళ కమెడియన్ కమ్‌ హీరో అయిన సంతానం మాత్రం సూర్యకు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా విమర్శలు వస్తున్నాయి.

సంతానం నటించిన ఒక సినిమా విడుదల సందర్బంగా ప్రమోషనల్‌ ఈవెంట్స్ లో పాల్గొన్నాడు. ఆ సమయంలో మీడియాతో ఆయన ముచ్చటించాడు. అప్పుడే జై భీమ్‌ గురించిన వివాదంను ఆయన ముందు ఉంచగా ఆయన స్పందిస్తూ.. ఒక వర్గంను కీర్తించేందుకు మరో వర్గంను చెడుగా చూపించడం సరైనది కాదన్నాడు. డైరెక్ట్‌ గా సూర్య ను ఉద్దేశించి కాని కాని జై భీమ్‌ సినిమాను ఉద్దేశించి కాని సంతానం వ్యాఖ్యలు చేయలేదు కాని ఆయన తీరు సూర్యకు వ్యతిరేకంగా ఉందని.. ఆయన మద్దతు పీఎంకే పార్టీకే అన్నట్లుగా ఉందని మీడియా వర్గాల వారు అంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో సూర్యకు మద్దతుగా హ్యాష్‌ ట్యాగ్స్ ట్రెండ్‌ అవుతున్నాయి.. వాటి గురించి మీ స్పందన ఏంటీ అంటూ ప్రశ్నించగా నేను ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో లేను. నా సినిమా పనులతో నేను బిజీగా ఉన్నాను అన్నాడు.

సంతానం వ్యాఖ్యలు తమకు మద్దతుగా ఉండటంతో పీఎంకే పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సంతానంకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఆయన పేరుతో హ్యాష్ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ నుండి పలువురు స్పందించి సూర్యకు మద్దతు తెలిపారు.. కాని సంతానం మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా అనిపించిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో సూర్య అభిమానులు సంతానంను టార్గెట్‌ చేస్తున్నారు. బుద్ది ఉందా నీకు.. ఇండస్ట్రీకి చెందిన వాడివేనా లేదా ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఉన్నావా.. ఒక మంచి సినిమాను మద్దతు ఇవ్వకున్నా విమర్శించడం సబబు కాదనే విషయం నీకు తెలియదా అంటూ సూర్య అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
Tags:    

Similar News