దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ - ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో 'కొమురం భీమ్'గా తారక్.. 'అల్లూరి సీతారామరాజు'గా చరణ్ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కలుసుకోని తెలంగాణ విప్లవవీరుడు కొమురం భీమ్ మరియు ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు రామరాజులు కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే నేపథ్యంలో సినిమా ఉంటుందని.. వారి మధ్య స్నేహాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నామని మేకర్స్ మొదటి నుంచీ చెప్తూనే ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఇంట్రో వీడియోలు ఈ సినిమాపై మరింత హైప్ ని తీసుకొచ్చాయి. చరణ్ ని నిప్పుల్లో చూపించిన రాజమౌళి.. ఎన్టీఆర్ ని నీళ్లలో చూపించాడు. ఈ క్రమంలో జక్కన్న ఈ సినిమాలో 'జలియన్ వాలా భాగ్' ఉందంతాన్ని కూడా ప్రస్తావించబోతున్నాడని టాక్ నడుస్తోంది.
కాగా, స్వాతంత్ర్యానికి పూర్వం 1919 ఏప్రిల్ 13 వైశాఖీ పండుగ రోజున అమృత్ సర్ జలియన్ వాలాబాగ్ లో నిర్వహించిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. 6.5 ఎకరాల స్థలంలో ఉన్న జలియన్ వాలాబాగ్ కు లోపలికి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా ఒకటే దారి ఉండేది. సభ జరుగుతున్న సమయంలో బ్రిటీష్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ వారిపై కాల్పులు జరిపించడంతో 1000 నుంచి 1500 మంది వరకు చనిపోయారని చరిత్రకారులు చెబుతుంటారు. ఇప్పుడు ఈ ఊచకోత ఘటనను రాజమౌళి తన ఫిక్షనల్ స్టోరీ 'ఆర్.ఆర్.ఆర్' లో చూపించనున్నాడట. త్వరలోనే రాజమౌళి ఈ సీక్వెన్స్ ని తనదైన శైలిలో షూట్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారట. ఈ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్ సన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.