తమిళనాడులో రజనీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా ఈ సూపర్ స్టార్ కూతురుకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ఆమె చిత్రపటాలను దహనం చేస్తున్నారు వీరవిళ్లైయాట్టు మీట్పు కళగం నిర్వాహకులు. అదేంటి.. తంబీల ఆరాద్యదైవం వంటి రజనీకాంత్ కు వ్యతిరేకంగా అలా చేస్తున్నారా... ఆయన కూతురు ఫోటోలను దహనం చేస్తున్నారా? అని ఆశ్చర్యపోకండి. దానికి కూడా అంతకంటే బలమైన కారణం ఉంది మరి!
విషయానికొస్తే... సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు - సినీ దర్శకురాలు సౌందర్యరజనీకాంత్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఆమె చిత్ర పటాలను దహనం చేస్తున్నారు తిరుచ్చిలో వీరవిళైయాట్టు మీట్పు కళగం నిర్వాహకులు. భారతదేశం యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్ గా సౌదర్య రజనీకాంత్ నియమించిన విషయం తెలిసిందే. దీంతో సౌందర్య ఆ బాధ్యతలను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ వీరు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సౌందర్య చిత్ర పటాలను దహనం చేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరవిళైయాట్టు మీట్పు కళకం నిర్వాహకులు మాట్లాడుతూ.. అసలు విషయం చెప్పారు.
సౌందర్య రజనీకాంత్ ను యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమించడం అనేది, దానికి ఆమె అంగీకరించడం అనేది జల్లికట్టును ఆదరించేవాళ్లు, తమిళ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిందని చెబుతున్నారు వీరవిళైయాట్టు మీట్పు కళగం నిర్వాహకులు. నిన్నటివరకూ జల్లికట్టు నిషేధానికి కారణంగా నిలిచిన యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు అంబాసిడర్‌గా తమ అభిమాన నటుడి కూతురును ఎంపిక చేయడం ఖండించతగ్గ విషయంగా వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా తమిళ చిత్రాల్లో నటించి డబ్బు సంపాదించుకున్న కొందరు నటీనటులు జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడడం దారుణం అని వారు అంటున్నారు. రజనీకాంత్ ఈ విషయంలో కలగజేసుకుని యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమితులైన తన కూతురు సౌందర్యరజనీకాంత్‌ను ఆ బాధ్యతనుంచి వైదొలిగేలా చేయాలని.. అలాకాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు వ్యతరేకంగా ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.