జల్సా రీ రిలీజ్ కలెక్షన్స్.. పోకిరి రికార్డ్ బ్రేక్

Update: 2022-09-03 05:01 GMT
అసలు జనాలు థియేటర్లకు రావడం లేదు అని అనుకుంటున్నా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే మాత్రం థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయని ఇటీవల కొన్ని సినిమాలు నిరూపించాయి. ముఖ్యంగా రీ రిలీజ్ లు ప్రత్యేకంగా ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు.

ఒక విధంగా అభిమానులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునే రీ రిలీజ్ ట్రెండ్ ఇటీవల పోకిరి సినిమాతో మరో లెవెల్ కు వెళ్ళిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ట్రెండు మరింత హీటెక్కే అవకాశం ఉన్నట్లు కూడా అనిపిస్తోంది.

ఆల్రెడీ యూట్యూబ్లో వందల సార్లు చూసిన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మళ్లీ థియేటర్లోకి వెళ్లి దీన్ని ఒక సెలబ్రేషన్ ల హైలెట్ చేయడం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. 2008లో వచ్చిన జల్సా సినిమా అప్పట్లో కమర్షియల్ గా అయితే పెద్దగా రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. కానీ ఆ సినిమాలో ఒక మంచి కంటెంట్ జనాలు మిస్ అయ్యారు అనే కామెంట్ అయితే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటనతో పాటు ఇంటర్వెల్ బ్లాక్ ఈ సినిమాకు మేజర్ హైలైట్.

ఇలాంటి సినిమాను మరోసారి థియేటర్లో చూడాలి అనే చాలా మంది కోరుకున్నారు. ఇక అనుకున్నట్లే జల్సా సినిమాను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రీ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. అమెరికాలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ హడావిడితో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

ఇక ఇటీవల పోకిరి సినిమా నెలకొల్పిన రికార్డును కూడా జల్సా బ్రేక్ చేయడం విశేషం. పోకిరి సినిమా రీ రిలీజ్ 1.5 కోట్ల కలెక్షన్స్ అందుకోగా జల్సా సినిమా అంతకంటే ఎక్కువగా 2.85 కోట్ల వసూళ్లను అందుకొని రీ రిలీజ్ క్యాటగిరి లోనే ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది.

పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో దీంతో మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఇక వచ్చిన డబ్బులు మొత్తం కొన్ని సామాజిక సేవ కార్యక్రమంలో కోసం ఉపయోగించబోతున్నారు. ఇక రాబోయే ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు రీ రిలీజ్ లతో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News