జాతీయ గీతం `జనగనమణ` ఇప్పుడు మరోసారి ట్రెండీ టాపిక్ గా మారింది. ట్రిగ్గర్ స్ట్రైకింగ్ టైటిల్ ఇది. అందుకే ఇటు పూరి జగన్నాథ్ చాలా కాలంగా ఈ టైటిల్ ని లాక్ చేసి మహేష్ లాంటి అగ్ర హీరోతో సినిమా తీయాలనుకున్నారు. కానీ మహేష్ తో వీలుపడలేదు. దీంతో విజయ్ దేవరకొండతో వెంటనే మొదలెట్టేసాడు. ఇంతకుముందు విడుదల చేసిన పోస్టర్ లో దేవరకొండ ఆర్మీ అధికారి లుక్ తో కనిపించారు.
ఇదంతా సరే కానీ.. ఇదే టైటిల్ తో మలయాళంలో మరో సినిమా రిలీజ్ కి వచ్చేయడం షాకింగ్. పృథ్వీరాజ్ సుకుమార్ ఈ సినిమాలో నటించి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కారణం ఏదైనా ఆ టైటిల్ తో క్లాష్ లేకుండా పూరి - వీడీ టీమ్ జేజీఎం (జనగనమణ) అంటూ షార్ట్ కట్ టైటిల్ ని ప్రకటించారు.
ఇకపోతే ఒక జాతీయ గీతాన్ని టైటిల్ గా పెట్టుకుంటే దేశభక్తుల నుంచే కాదు సామాన్య ప్రజల నుంచి కూడా కొన్ని చిక్కులు ఉన్నాయి.
కంటెంట్ పరంగా ఎక్కడ తేడా జరిగినా చీవాట్లు తప్పదు. అసలే మనోభావాలు దెబ్బ తినే కాలమిది. వెంటనే థియేటర్లలో మంటలు పుట్టేయడం ఖాయం.
అల్లర్లు గొడవలకు ఆస్కారం ఉంటుంది. ఇక జాతీయ గీతం రేంజును పెంచేలా కథాంశాలు ఉండాలి. పృథ్వీరాజ్ అయినా విజయ్ దేవరకొండ - పూరి అయినా ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారు? అన్నది తెరపైనే చూడాలి.