యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ మూవీతో ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టేయాలన్నది ఈ స్టార్ హీరో డైరెక్టర్ ఆలోచన. ముందుగానే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని షూటింగ్ ప్లాన్ చేస్తుండగా.. ఆగస్ట్ 12 డెడ్ లైన్ మిస్ కాకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే జనతా గ్యారేజ్ కి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిపోగా.. ప్రస్తుతం తన పాత్రకు ఎన్టీఆర్ డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నాడు. చివరి నిమిషంలో హడావిడి పడకుండా పర్ఫెక్ట్ గా సినిమాని రిలీజ్ చేసేందుకు అన్ని రకాలు గాను జనతా గ్యారేజ్ సిద్ధమయిపోతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం కొన్ని పాటలను ఇంకా షూట్ చేయాల్సి ఉండగా.. వీటిని శ్రీలంకలో తెరకెక్కించేలా ప్లాన్ చేశారు. ఇప్పటివరకూ జనతా గ్యారేజ్ కోసం రెండు పాటలను తీయగా..ఒకటి ముంబై లోను, మరొకటి హైద్రాబాద్ లోను పిక్చరైజ్ చేశారు.
మరో నాలుగు పాటలు జూలై ఆఖరివారం నాటికి పూర్తి కానున్నాయట. అటు షూటింగ్ తో పాటు ఇటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగిపోతుండడంతో.. ఆగస్ట్ 12న విడుదల కావడంలో ఎలాంటి అనుమానాలు లేవని తేలిపోతోంది. సమంత - నిత్యా మీనన్ లు హీరోయిన్ లుగా నటించిన జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ - సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.