యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ క్రేజు మామూలుగా లేదు. ఇప్పటికే ఈ ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాకేసింది. జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుంచీ ఈ చిత్రంపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఈ మధ్యనే విడుదలైన పాటలు కూడా బాగుండటం, టీజర్ అదరగొట్టడంతో తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తొలిరోజు సినిమా చూడ్డం కంటే... బెనిఫిట్ చూసెయ్యాలన్న ఆరాటంతో అభిమానులు ఆత్రంగా ఉన్నారు. 31వ తేదీ అర్ధరాత్రి 1 గంటకూ - 4 గంటలకూ... రెండు బెనిఫిట్ షోలు వేసేందుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరిగిపోయాయి. చాలాచోట్ల టిక్కెట్లు అమ్మకాలు కూడా అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో తారక్ క్రేజు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. కానీ, పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా జనగా గ్యారేజ్ బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు పోటీపడుతుండటం విశేషం.
చెన్నైలో ఎన్టీఆర్ కి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. జనతా గ్యారేజ్ బెనిఫిట్ టిక్కెట్ల కోసం వీరంతా పోటీ పడ్డారు. చెన్నైలోని ఎస్.ఆర్.ఎం. యూనివర్శిటీలో టిక్కెట్లు వేలం వేశారు. తెలుగుదేశం పార్టీ చెన్నై యువసేన విభాగం ఈ టిక్కెట్ల వేలాన్ని నిర్వహించింది. దీన్లో అత్యధికంగా తొలి టికెట్‌ను రూ. 31,000కు ఒక అభిమాని సొంతం చేసుకున్నాడు. రెండో టికెట్ ధర రూ. 17,500 పలికింది. మూడో టికెట్ వెల రూ. 13,000కు వెళ్లింది. ఇలా అభిమానులు పోటీపడి టిక్కెట్లను సొంతం చేసుకున్నారు. జనతా గ్యారేజ్ ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ - బాహుబలిని దాటేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు.